మెగా బ్రదర్ ను వదిలి పెట్టని అరవింద సమేత !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల సాన్నిహిత్యంలో కొద్దిగా గ్యాప్ ఏర్పడినా త్రివిక్రమ్ మనసు మాత్రం ఎప్పుడూ మెగా ఫ్యామిలీ పైనే ఉంటుంది అని చెప్పే ఆసక్తికర విషయం లీక్ అయింది. తెలుస్తున్న సమాచారంమేరకు త్రివిక్రమ్ లేటెస్ట్ గా తీస్తున్న ‘అరవింద సమేత’ లో మెగా బ్రదర్ నాగబాబుకు ఒక కీలక పాత్రను క్రియేట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

‘అజ్ఞాతవాసి’ వల్ల వచ్చిన అపవాదు నుండి బయటపడటానికి త్రివిక్రమ్ తన శక్తిని అంతా కూడగట్టుకుని జూనియర్ తో తీస్తున్న ‘అరవింద సమేత’ లో నాగబాబును రాయలసీమ ఫ్యాక్షన్ నడిపే లీడర్ గా నెగిటివ్ షెడ్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నాగబాబు కెరియర్ లో చెప్పనటి వంటి భారీ ఫ్యాక్షన్ డైలాగులు నాగబాబు నోటివెంట చిత్తూరు యాసలో చెప్పించడానికి త్రివిక్రమ్ ప్రత్యేకంగా డైలాగులు వ్రాస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో చిత్తూరు యాసను సరిగ్గా పలకడానికి నాగబాబుకు ప్రత్యేకమైన ట్యూటర్ ను కూడ త్రివిక్రమ్ ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ ఫస్ట్ లుక్ విడుదలై అంచనాలు అమాంతం పెంచుకున్న నేపధ్యంలో నాగబాబు సరికొత్త ప్రయోగంతో ఈమూవీకి మరింత క్రేజ్ ఏర్పడుతుందని త్రివిక్రమ్ ఎత్తుగడ అని అంటున్నారు. 

ఈమూవీ సక్సస్ త్రివిక్రమ్ కు చాల కీలకంగా మారడంతో సంగీత దర్శకుడు తమన్ చేత పట్టుపట్టి చాల మంచి ట్యూన్స్ త్రివిక్రమ్ రాబడుతున్నాడు. రాబోతున్న దసరాను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ సక్సస్ జూనియర్ కు కన్నా త్రివిక్రమ్ కు అత్యంత కీలకంగా మారింది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ అభిమానులతోపాటు మెగా అభిమానులను ధియేటర్లకు రప్పించడానికి త్రివిక్రమ్ నాగబాబు ప్రయోగం పై దృష్టి పెట్టాడనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: