బిగ్ బాస్-2 మొదట ఎలిమినేటర్ ఎవరు.. గెస్ చేయగలరా..?

shami
బిగ్ బాస్ సెకండ్ సీజన్ అనుకున్నంత జోష్ కనబడలేదు. నాని హోస్ట్ గా వస్తున్న ఈ రియాలిటీ షో ఈ సీజన్ మరింత మసాలాతో వస్తుందని అన్నారు. అనుకున్నట్టుగానే మొదటి రోజు నుండి కంటెస్టంట్స్ మధ్య గొడవలు పెరిగాయి. కామన్ మెన్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటూ మధ్య ఓ తేడా వచ్చేసింది.


ఇక ఈ వారం ఎలిమినేటర్ లిస్ట్ లో గణేష్, సంజనా, దీప్తి సునైనా, కిరీటి, కౌశల్, నూతన్ నాయుడు ఉన్నారు. కచ్చితంగా వీరిలో ఒకరు బయటకు వస్తారని తెలిసిందే. అయితే సంజనా, కిరీటి, కుశల్ సేఫ్ సైడ్ అయినట్టే. బిగ్ బాస్ హౌజ్ లో ఉండాలంటే గొడవలు పెట్టేవాళ్లే ఉండాలి. అంతేకాదు జనాధరణ పొందే వాళ్లు ఉంటారు.


గణేష్, నూతన్ నాయుడులతో పాటుగా కామన్ మెన్ గా వచ్చిన సంజనా సెలబ్రిటీస్ లానే కావాల్సినంత పాపులారిటీ తెచ్చుకుంది. హౌజ్ లో సెలబ్రిటీస్ పేర్లు అయినా గుర్తుంచుకుంటారో లేదో సంజనా మాత్రం గుర్తొస్తుంది. అలా ఆమె హడావిడి ఉంది. ఇక ఈరోజు నాని వస్తున్నాడు. ఎవరిని ఎలిమినేట్ చేస్తాడు అన్నది పెద్ద టాస్క్.


కచ్చితంగా అందరి అంచనాలకు అనుగుణంగా ఉండే ఛాన్స్ అయితే లేదు. గణేష్, నూతన్ నాయుడు ఈ ఇద్దరి పైనే అందరి గురి ఉంది. నూతన్ నాయుడు అయితే ఇంకా అసలు తానేంటో బయటపడలేదు. అందరికంటే హౌజ్ లో చిన్నవాడిగా ఉంది గణేష్ మాత్రమే. మరి ఫైనల్ గా ఎవరు బిగ్ బాస్ 2 మొదటి ఎలిమినేటర్ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: