నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇంట ఇప్పుడు ఆనందోత్సాలు వెల్లువిరిశాయి. ఎన్టిఆర్ సతీమణి లక్ష్మీప్రణతి రెండోసారి కూడా పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తారక్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
తన భార్య మరోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిందని.. తన కుటుంబం మరింత పెద్దదయిందంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ రెండవ కొడుకు ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఎన్టిఆర్ దంపతులకు 2011లో తొలి సంతానంగా అభయ్ పుట్టగా, ఇప్పుడు రెండోసారి కూడా మరో మగబిడ్డ జన్మించడంతో తారక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాజాగా రెండో కుమారుడి ఫోటో బయటకు వచ్చింది.