పాపం సంజయ్ దత్..ఆ సమయంలో బిచ్చమెత్తుకున్నారట..

Edari Rama Krishna
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అంటే తెలియని వారు ఉండరు..ఆయన సినీ జీవితం కన్న నిజ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలే చాలా మందిని కన్నీరు పెట్టిస్తుంటాయి.  ఒకప్పటి స్టార్ హీరో సునీల్ దత్, స్టార్ హిరోయిన్ నర్గీస్ ల ముద్దుల తనయుడు సంజయ్ దత్.  చిన్ననాటి నుంచి కాస్త గారాభం ఎక్కువ కావడంతో అల్లరి చిల్లరిగా పెరిగిన సంజయ్ దత్ టీనేజ్ వయసులో డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు.  అప్పటి నుంచి ఆయన జీవితం అంధకారంలో పడిపోయింది. 

ఓ వైపు స్టార్ హోదాలో ఉన్న నటుల మద్య సంజయ్ దత్ జీవితం చీకటి మయంగా మారిపోయింది.   బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘సంజు’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ను రణ్ బీర్ కపూర్ పోషిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘సంజు’ ట్రైలర్  ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి విడుదల చేశారు.

తాజాగా విడుదల చేసిన ఓ పోస్టర్ పై ‘అమెరికాలోని రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి పారిపోయిన సంజు .. తన మిత్రుల వద్దకు వెళ్లడానికి బస్సు టిక్కెట్ కొనేందుకని అక్కడి వీధుల్లో బిచ్చమెత్తుతున్నాడు’ అని రాసి ఉంది. మరో పోస్టర్ పై.. ‘సంజు తొలి చిత్రం రాకీ ప్రీమియర్ షోకు మూడు రోజుల ముందు తన తల్లి నర్గీస్ దత్ ను కోల్పోయాడు’ అని రాసి ఉంది. అత్యంత ధనవంతుల ఇంట్లో పుట్టి ఎన్నో కష్టాలు పడ్డారు.ఒక దశలో డ్రగ్స్‌కు బానిసయ్యారు. అక్రమ ఆయుధాల కేసులో జైలు పాలయ్యారు. 

లగ్జరీ కార్లు, భవంతుల్లో గడిపిన వ్యక్తి ఒకానొక దశలో అత్యంత దుర్భర జీవితం గడిపారు. ఆయన జీవితం నేటి యువతకు ఓ పాఠం లాంటిది. అందుకే ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ ఆయన జీవిత కథను సినిమాగా తీస్తున్నారు. కాగా, ఈ నెల 29న ‘సంజు’ విడుదల కానుంది. సంజయ్ దత్ తల్లిదండ్రుల పాత్రల్లో పరేశ్ రావెల్, మనీషా కొయిరాలా నటించారు. ఇంకా ఈ చిత్రంలో సోనమ్ కపూర్, దియా మీర్జా, అనుష్క శర్మ నటించారు.
Sanju’s journey is marked by many ups and downs. Some moments suspend you into disbelief. See these postcards i.. Every image a story.. a story unbelievable but true... #BelieveItOrNot #Sanju #RanbirKapoor @FoxStarHindi @VVCFilms #RajkumarHiraniFilms pic.twitter.com/aonv8f6DDT

— Rajkumar Hirani (@RajkumarHirani) June 14, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: