వర్మ ఇచ్చిన బహుమతి పై నాగ్ సంచలన వ్యాఖ్యలు !

Seetha Sailaja
నాగార్జున మూనీ ‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగ్ వర్మను టార్గెట్ చేస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. వర్మ ‘ఆఫీసర్’ కథ చెప్పినప్పుడు ఆసినిమా గురించి తాను ఆలోచించి నిర్ణయం చెపుతాను అని అన్నప్పుడు తనకు వర్మ ఒక ఉత్తరాన్ని తన చేతిలో పెట్టిన విషయాన్ని బయటపెట్టాడు. 

ఆ ఉత్తరంలో వర్మ వ్రాసిన మాటలు కంటే ఎక్కువ బూతులు ఉన్నాయని అయితే చివర్న మాత్రం తాను తనకు చెప్పినట్లుగా ‘ఆఫీసర్’ ను తీయకపోతే ఇంటికి పిలిచి తన్నమని చెప్పి తనకు షాక్ ఇచ్చిన సందర్బాన్ని గుర్తుకు చేసుకున్నాడు నాగ్. అయితే ‘శివ’ వల్ల తన కెరియర్ టర్న్ అయింది అని చెపుతూ ఉంటారాని కానీ అమల లాంటి మంచి భార్యను ‘శివ’ సినిమా ద్వారా తనకు వర్మ బహుమతిగా ఇచ్చాడని అందువల్ల వర్మ పై ఎంతమంది విమర్శలు చేసినా తాను పట్టించుకోను అంటూ వర్మ పై తన అభిమానాన్ని కురిపించాడు నాగ్.

‘శివ’ విడుదలైన తరువాత చాలామంది ఆసినిమాలో వర్మ ప్రయోగించిన సౌండ్ గురించి మాట్లాడుకున్నారని అయితే అలాంటి సౌండ్ ‘ఆఫీసర్’ లో మళ్ళీ వినిపిస్తూ ఆ సౌండ్ మన గుండెలను తాకుతుంది అంటూ ‘ఆఫీసర్’ సినిమా పై అంచనాలు పెంచాడు నాగార్జున. ఈమూవీ చివరి 20 నిముషాలలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఒకనాటి ‘బ్రూస్ లీ’ ‘రాంబో’ సినిమాలను గుర్తుకు చేస్తాయి అంటూ ‘ఆఫీసర్’ మూవీ మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతోంది అన్న సంకేతాలు ఇస్తున్నాడు నాగార్జున. 

ఒక ‘ఆఫీసర్’ క్రిమినల్ గా మారితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో ఈకథ పుట్టింది అని చెపుతూ వర్మ ఈమూవీ స్టోరీ లైన్ ను బయట పెట్టాడు. అంతేకాదు తానెప్పుడు దేవుడుని పూజించకపోయినా పుణ్యాలు చేయకపోయినా పెద్దలను గౌరవించకపోయినా నాగార్జున లాంటి మంచి మనిషి తనకు దొరకడం తాను ఎదో జన్మలో చేసుకున్న పుణ్యం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన వర్మ కంట కన్నీళ్ళు కనిపించడం పరిశీలించిన వారు వర్మను నాగార్జున నిజంగా మార్చివేసాడా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: