సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ ఉందని అంగీకరించిన సమంత అక్కినేని

ఇటీవల కలకలం సృష్టిస్తున్న కాస్టింగ్ కౌచ్, కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న అంశం. హాలీవుడ్లో మొదలై, టాలీవుడ్ వరకు ఇదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీరెడ్డి వెలుగులోకి తెచ్చిన ఈ సమస్యకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. ముందు స్పందించని సినీ పరిశ్రమ కొన్ని అనూహ్య పరిణామాల తర్వాత స్పందించక తప్ప లేదు. కొన్ని చర్యలు కూడా చేపట్టాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రెటీలు కాస్టింగ్ కౌచ్ గురించి తమ అభిప్రాయాలు వెల్లడించారు. 

తాజాగా టాలీవుడ్ అగ్రనటి అక్కినేని నాగార్జున కోడలు సమంత సైతం ఈ అంశంపై తన అభిప్రాయం చెప్పవలసిన అవసరం ఏర్పడింది. అయితే ఆమే స్పందన వేరే వారికి భిన్నంగా ఏమీ లేదు.  కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం చిత్ర రంగానికి మాత్రమే పరిమితం కాదంటూ అందరూ చెప్పినట్లే సమంత కూడా చెప్పింది. తాను ఒక్కొక్కరి గురించి స్పందించలేనని, ప్రతి రంగం లోనూ మంచి వారితో పాటు కొందరు చెడ్డ వ్యక్తులు ఉంటారని సమంత అంది. తాను గత ఎనిమిదేళ్లుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో పని చేస్తున్నానని, తన తొలి సినిమానే అత్యద్భుత విజయం సాధించడంతో తనకు ఎప్పుడూ ఎక్కడా ఇబ్బంది కూడా కాస్టింగ్ కౌచ్ సమస్య తలెత్తలేదని ఆమె స్పష్టం చేసింది. 

సినీ పరిశ్రమలో ఎన్నో మంచి మంచి విషయాలు జరుగుతుంటాయని, తనకీ ఈ పరిశ్రమ అంటే చాలా చాలా ఇష్టమని, కొండొకచో ప్రాణమని, ఇక్కడే తాను ఎందరో గొప్ప  గొప్ప వ్యక్తుల్ని కలిశానని సమంత అంది. అందుకే ఒక బిడ్డకు జన్మని ఇచ్చిన తరవాత కూడా తాను సినీ పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు సమంత చెప్పడం విశేషం. ప్రభుత్వం స్పందించి సినీ పరిశ్రమలో అమ్మాయిల క్షేమం సంరక్షణ కోసం ఒక "స్పెషల్ సెల్" ఏర్పాటు చేయడాన్ని ఆమె స్వాగతించింది.

అలాంటి వంచకులను తరిమేస్తే చిత్ర పరిశ్రమ అంత మంచిది మరొకటి ఉండదన్నారు. అయితే అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి కొన్ని చట్టాలు రూపొందించారు.. ఇకపై అత్యాచారాలు జరగవని భావిస్తున్నాని సమంత పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ బిజీగా ఉందని చెప్పవచ్చు.  సమంత నటించిన రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. మహానటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన నడిగైయార్‌ తిలగం ఈ నెల 9న విడుదలకు సిద్ధం అవుతుంది. మరొకటి విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబుతిరై ఈ నెల 11న తెరపైకి వస్తోంది.  

అలాంటి వారిని తరిమేస్తే చిత్ర పరిశ్రమ అంత మంచిది మరొకటి ఉండదన్నారు. అయితే అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి కొన్ని చట్టాలు రూపొందించారు, ఇకపై అత్యాచారాలు జరగవని భావిస్తున్నాని సమంత పేర్కొన్నారు. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ బిజీగా ఉందని చెప్పవచ్చు.  సమంత నటించిన రెండు చిత్రాలు త్వరలో తెరపైకి రానున్నాయి. మహానటి సావిత్రి జీవిత చరిత్ర తో రూపొందిన మహనటి (నడిగైయార్‌ తిలగం) ద్విభాషా చిత్రంగా ఈ నెల 9న విడుదలకు సిద్ధం అవుతుంది. మరొకటి విశాల్‌కు జంటగా నటించిన ఇరుంబు తిరై ఈ నెల 11న తెరపైకి వస్తోంది.  

ఈ సందర్భంగా సమంత శనివారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, కొత్త దర్శకుల చిత్రాల్లో పనిచేయడానికి కాస్త సంకోచిస్తానన్నారు. "కానీ దర్శకుడు మిత్రన్‌ తో ఇరుంబు తిరై చిత్రం చేస్తున్నప్పుడు ఆ విధమైన భావన కలగలేదు. కథ విన్నప్పుడు  చాలా ఆశ్చర్యపోయాను. మన జీవితాల్లో మనకు తెలియకుండానే ఇన్ని సమస్యలు అంతర్జాల సమాచార వాహిని (ఇంటర్నెట్‌ మీడియా) ద్వారా జరుగుతున్నాయా? అని షాక్ అయ్యానన్నారు. కథ విన్న తర్వాత సెల్‌ఫోన్‌-టచ్‌ చేయడానికే భయమేసింది. ఈ చిత్రంలోని సంఘటనలు నా జీవితం లో జరగకపోయినా, నా స్నేహితురాళ్లకు ఎదురయ్యాయి


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: