శ్రీరెడ్డిని సమర్ధించిన దర్శకుడు!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా నడుస్తుంది కాస్టింగ్ కౌచ్ వివాదం.  తెలుగు అమ్మాయిలకు చాన్స్ రావాలంటే..దర్శక, నిర్మాతలు, హీరోలు వారిని వాడుకుంటున్నారని..అంతే కాదు జూనియర్ ఆర్టిస్ట్ లను సప్లై చేసే వారు కూడా దారుణంగా అమ్మాయిలను అనుభవిస్తున్నారని నటి శ్రీరెడ్డి ఆరోపిస్తుంది.  అంతే కాదు ‘మా’ ఫిలిమ్ ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో ఈ విషయం నేషనల్ స్థాయికి చేరుకుంది. దాంతో ఆమెకు మహిళా సంఘాల మద్దలభించడంతో కొంత మంది జూనియర్ ఆర్టిస్టులతో సమావేశం ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉంటే..నిన్న పవన్ కళ్యాన్ విషయంలో శ్రీరెడ్డి కాస్త ఓవర్ గా రియాక్ట్ కావడం..పర్సనల్ విషయాలు మాట్లాడటం..తనను అన్నయ్యా అని అనడం తప్పని చెప్పుతో కొట్టుకొని తిట్టడం పెద్ద వివాదం అయ్యింది.  అప్పటి వరకు ఆమెకు సపోర్ట్ గా ఉన్నవారు కొంత మంది యూటర్న్ తీసుకున్నారు.  ఇక పవన్ ఫ్యాన్స్ అయితే యూట్యూబ్ వేధిక చేసుకొని బండబూతులు తిడుతున్నారు. 

తాజాగా ఈ వివాదంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. కోపం వచ్చినప్పుడు తిట్లు తిట్టడం అనే విషయం సర్వ సాధారణమని, ప్రతి ఒక్కరూ తిట్లను ఉపయోగిస్తూనే ఉంటారని అన్నారు. ఆ మాటకొస్తే పవన్‌ కల్యాణ్‌కి ఉన్న కొంత మంది అభిమానుల భాష చూస్తే తిట్లు తప్ప వారికి వేరే ఏమీ రావన్నట్లు ఉంటుందని వ్యాఖ్యానించారు.

వాస్తవానికి తాను తన కుటుంబ సభ్యులు పవన్ కళ్యాన్ ని ఎంతగానో అభిమానిస్తామని..తాను పవన్‌ని సీఎంగా చూడాలనుకుంటున్నానని చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది ఎప్పటి నుంచో ఉందని, శ్రీరెడ్డి తీసుకున్న నిర్ణయం, చేస్తోన్న పోరాటంతో ఇప్పుడు ఆ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు. సామాజిక కార్యకర్తలు సంధ్య, దేవిలాంటి వారు శ్రీరెడ్డి తరఫున పోరాడాలని, ఈ విషయంపై దృష్టిపెట్టి పోరాడాలని వర్మ పిలుపునిచ్చారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: