షాకింగ్ : తల్లి కాబోతున్న ఇలియానా..!?

Vasishta

బెల్లీ బేబీగా పేరొందిన ఇలియానా .. కుర్రకారు గుండెలు కొల్లగొట్టేసింది. టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో రామ్ సరసన ఇంట్రడ్యూజ్ అయింది ఇలియానా.. ఆ తర్వాత బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు చేసిందీ సుందరి. ఇటీవలే ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ను పెళ్లి చేసుకుంది ఇలియానా. అయితే త్వరలోనే ఈ భామ ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయ్.


          ఇలియానా డిక్రూజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రెయిడ్’. అజయ్ దేవగన్ తో కలిసి ఇలియానా నటించిన ఈ మూవీ ఇప్పటికే వంద కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమా ప్రమోషన్ లోనే ఇలియానా బిజీగా ఉంటోంది. అయితే ప్రమోషన్ కోసం ఎక్కడికి వెళ్లినా ఇలియానా వేసుకున్న డ్రస్సులు పలు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయి. తేలికైన, వదులైన దుస్తులు వేసుకుని వెళ్లుండడంతో ఇలియానా తల్లి కాబోతోందా.. అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు భర్త సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో మరింత బలం చేకూర్చేలా ఉంది.


          ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ ను ఇలియానా పెళ్లి చేసుకుంది. అయితే తన పెళ్లి విషయాన్ని ఎప్పుడూ, ఎక్కడా ఇలియానా బయటపెట్టలేదు. ఆండ్రూతో కలిసిన ఫోటోను సోషల్ మీడియాలో ఎప్పుడు పెట్టినా ‘హబ్బీ’ అని సంబోధిస్తుండడంతో అందరూ పెళ్లయిపోయిందనుకుంటున్నారు. తాజాగా ఆండ్రూ నీబోన్ ఇలియానా  ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాత్ టబ్ లో కాఫీ తాగుతూ సేద తీరుతున్న ఫోటోను పెట్టి ఓ క్యాప్షన్ పెట్టాడు. “ఇలియానా ఒంటరిగా మధురమైన క్షణాలను అనుభవిస్తోంది” అని క్యాప్షన్ పెట్టాడు.


          ఆండ్రూ నీబోన్ పెట్టి ఫోటో, ఇలియానా ప్రమోషన్లలో కనిపిస్తున్న తీరు పోల్చుకుంటున్నప్పుడు అందరికీ ఆమె తల్లి కాబోతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అయితే తల్లి కాబోతున్నాననే విషయం ఇలియానా కానీ, గర్భవతి అనే విషయం అటు ఆండ్రూ కానీ ఎక్కడా బయటపెట్టలేదు. బహుశా వీళ్లు చెప్పకపోవచ్చు. ఎందుకంటే.. అసలు పెళ్లి విషయమే వీళ్లు ఎవరితోనూ షేర్ చేసుకోలేదు. ఇంక ప్రెగ్నెంట్ అనే విషయం ఎందుకు చెప్తారూ..?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: