ఇండియన్ టాప్ సెలెబ్రెటీగా మారిపొయిన ప్రభాస్ కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈక్రేజ్ వల్లనే ప్రభాస్ కు బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్లు వస్తున్నాయి. అయితే ప్రభాస్ తన దృష్టి అంతా ‘సాహో’ పై పెడుతూ ‘బాహుబలి’ రేంజ్ లో ఈమూవీని హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ కు ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని పంజాబీలు ప్రభాస్ పై తీవ్ర అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనికి కారణం ఆరాష్ట్రంలో జరుగుతున్న ‘వైశాఖి’ పండుగ ఉత్సవాలు ఈ పండుగను పంజాబీలు చాలఘనంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిధిగా రావలసిందిగా ప్రభాస్ ను అనేక విద్యా సంస్థలు అదేవిధంగా అనేక సామాజిక సంస్థలు పిలిచినట్లు వార్తలు వస్తున్నాయి. గత సంవత్సరం ‘బాహుబలి 2’ ప్రమోట్ చేస్తూ ప్రభాస్ ఈ ‘వైశాఖి’ ఉత్సవాల సందర్భంగానే పంజాబ్ వెళ్ళి అక్కడి యూత్ మధ్య తెగ సందడి చేసాడు.
దీనితో పంజాబ్ లోని అనేక విద్యా సంస్థలు అదేవిధంగా యువజన సంఘాలు అసలు ప్రభాస్ వస్తాడో రాడో తెలియకుండానే వందలాది ఇన్విటేషన్స్ ప్రభాస్ కు పంపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు వందల సంఖ్యలో వస్తున్న ఏఒక్క ఇన్విటేషన్ కు ప్రభాస్ స్పందించక పోవడంతో పంజాబ్ ప్రాంతంలోని యూత్ తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు అక్కడి లోకల్ మీడియా వార్తలు రాస్తోంది.
కానీ వాస్తవానికి ప్రభాస్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న తన ‘సాహో’ షూటింగ్ లో బిజీగా ఉన్న నేపధ్యంలో దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల షూటింగ్ చేసేందుకు కష్టపడి అనుమతులు సంపాదించుకున్న నేపధ్యంలో ఆ షూటింగ్ వదిలి పంజాబ్ కు రాలేని పరిస్థితి ప్రభాస్ కు ఏర్పడింది. దీనితో ఈవిషయాలు అన్నీ వివరిస్తూ ప్రభాస్ తన వ్యక్తిగత సహాయకులు ద్వారా పంజాబీలకు తన పై ఏర్పడిన కోపాన్ని తగ్గించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది..