తమన్నా అవార్డుల ఖజానా! ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే అవార్డ్!

భారతీయ సినిమా జాతిపిత - ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గా ప్రసిద్ధి గాంచిన మరాఠి నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ రైటర్ అయిన దుందిరాజ్ గోవింద్ పాల్కె పేరుతో భారత ప్రభుత్వం స్థాపించిన దాదా సాహెబ్ పాల్కె అవార్డ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ సినీ రంగానికి అత్యున్నత స్థాయి అవార్డ్. ఈ అవార్డు ను 'డైరెక్టోరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్' అనే ప్రభుత్వ సంస్థ జాతీయ సినిమా అవార్డుల ఉత్సవం లో అవార్డులను అవార్డీలకు అందజేస్తారు. 

ఇది సినిమా రంగానికి ప్రభుత్వం తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారం. 'డైరెక్టోరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్' భారత సమాచార పౌర సంబందాల శాఖ లో ఒక భాగం. 'భారత చలన చిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రగతికి అత్యుత్తమంగా సహకరించిన వారికి ఈ అవార్డ్ ప్రధానం చేస్తారు' దాదా సాహెబ్ పాల్కే అవార్ద్. నటీ నటులకు ఒక జీవితాశయం. ఓ గొప్ప కల. ఏ ఎన్ ఆర్ - ఎన్ టి ఆర్ లాంటి దిగ్గజాలకే ఈ కల నెఱవేరటానికి చాలాకాలం పట్టింది. అయితే కొందరికి ఆ అదృష్ట యోగం అతి స్వల్ప వ్యవధిలోనే లభిస్తుంది.
  
ఇప్పుడు హాపీడేస్ సినిమాతో టాలీవుడ్ లో ఒక్క సారిగా నిశ్శబ్ధ విస్పొటనంలా ఈ నటి కథానాయకిగా వెలుగులోకి వచ్చింది ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పుడు ఆమె ఖాతాలోకి ఈ ప్రతిష్టాత్మక అవార్డు చేరింది. ఇటీవలే "జీ సంస్థలు" నిర్వహించిన "అప్సర అవార్డు" ల్లో "శ్రీదేవి" అవార్డు అందుకున్న "అప్సర తమన్నా"- తాజాగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు. 

ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే ఎక్స్‌లెన్స్‌ అవార్డు ఆమెను వరించింది. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన "బాహుబలి సిరీస్‌" రెండు బాగాల్లో నటించిన తమన్నా అవంతిక పాత్రలో ప్రఖ్యాతి గాంచిన సంగతి తెలిసిందే. బాహుబలి మొదటి భాగం లో తమన్నా అద్భుత నటనకు గాను ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందు కోన్నారు. తమన్నాతో పాటు ప్రతిష్ఠాత్మక పద్మవత్ లో నటించిన రణ్‌ వీర్‌ సింగ్‌, అలాగే పరి సినిమాతో అనుష్క శర్మలను ఈ అవార్డ్ లకు ఎంపిక చేశిందీ కమిటీ. వీరికి  కూడా ఈనెల 21న అవార్డులు ప్రదానం చేయనున్నట్టు ముంబైకి చెందిన "దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌" తెలిపింది.

తనకు ఈ అవార్డు ప్రకటించడం పట్ల హీరోయిన్‌ తమన్నా సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ సినిమా రంగానికి దాదాసాహెబ్ ఫాల్కే ఎంతో సేవ చేశారని, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన దాదా సాహెబ్ ఫౌండేషన్‌ నుంచి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో "నా నువ్వే" - క్వీన్‌ రీమేక్‌లో నటిస్తున్నారు. దీనితో నటిగా ఆమె చిత్ర జగత్తులో తన స్థానం పదిలం చేసుకున్నట్లే. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: