నాని ' కృష్ణార్జున యుద్ధం ' షార్ట్ రిఫ్యూ!

VUYYURU SUBHASH
వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న నాని.. వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ దృష్టిని త‌న వైపున‌కు తిప్పుకున్న మేర్ల‌పాక గాంధీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన సినిమా కృష్ణార్జున యుద్ధం. నాని జెంటిల్‌మ‌న్ సినిమా త‌ర్వాత డ‌బుల్ రోల్ చేసిన ఈ సినిమాలో నాని స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్ హీరోయిన్లుగా న‌టించారు. నాని కృష్ణుడు, అర్జ‌నుడిగా న‌టించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ప్రీమియ‌ర్ల రిపోర్టు ప్ర‌కారం సినిమాకు ఎలాంటి టాక్ వ‌చ్చిందో ?  చూద్దాం.

క‌థ‌గా చూస్తే...
తిరుపతిలో ఉండే కృష్ణ (నాని) సరదాగా ఉంటాడు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాడు. అమ్మాయిలంటే దూరంగా ఉండే కృష్ణ రుక్సార్ ను చూసి ఇష్టపడతాడు. మ‌నోడు ఆమె ప్రేమ‌కోసం నానా పాట్లు ప‌డుతుంటాడు. ఇక ఫారిన్‌లో ఉండే అర్జున్ (నాని) ఓ రాక్‌స్టార్‌. ప్లే బోయ్ క్యారెక్ట‌ర్ అయిన అత‌డికి సుబ్బలక్ష్మి (అనుపమ) నచ్చుతుంది.

కృష్ణ, అర్జున్ ఇద్దరు వారు ప్రేమించిన అమ్మాయిలను దక్కించుకునే క్రమంలో వారికి దూరం అవుతారు. చివ‌ర‌కు ఈ క్ర‌మంలోనే వారిద్ద‌రు క‌లుస్తారు. చివ‌ర‌కు వారు ప్రేమించిన అమ్మాయిలు ప్ర‌మాదంలో ఉన్నార‌ని తెలుసుకుని వారిని ఎలా కాపాడుకున్నారు ? అన్న‌దే క‌థ‌.


ఫ‌స్టాఫ్‌లో రెండు జంట‌ల ప్రేమ క‌థ‌ల‌ను స‌మాంతరంగా న‌డిపించిన ద‌ర్శ‌కుడు కామెడీ, ప్రేమ స‌న్నివేశాల‌తో బాగానే టైమ్ పాస్ చేయించాడు. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ సినిమాకు హైలెట్‌. అయితే సెకండాఫ్‌కు వ‌చ్చే స‌రికి కామెడీ తేలిపోయింది. క‌థ రొటీన్ ట్రాక్‌లోకి వ‌చ్చేసింది. దీనికి తోడు స్లో నెరేష‌న్‌. సినిమా ర‌న్ టైం ఎక్కువ కావ‌డంతో సాగ‌దీసిన ఫీలింగ్ కూడా క‌లుగుతుంది.


ఇద్దరు నానిలు. కృష్ణగా అమాయకత్వం, అర్జున్ గా చిలిపితనం రెండు బాగా చేశాడు. సినిమా మొత్తం తన భుజాన వేసుకుని నడిపించాడు. ఇక హీరోయిన్స్ అనుపమ, రుక్సార్ లు కూడా ఇంప్రెస్ చేశారు. 


స్క్రీన్ ప్లే బేస్ డ్ బ‌లంగా సాగిన సినిమాలో బ‌ల‌మైన క‌థ లేక‌పోవ‌డం మైన‌స్‌. ఫ‌స్టాఫ్ బాగున్నా, సెకండాఫ్ అసంతృప్తిగా అనిపిస్తుంది. ఓవ‌రాల్‌గా సినిమా ఓకేగా ఉన్నా నాని మేనియాతో మ‌నోడి ఖాతాలో మ‌రో హిట్ ప‌డిపోయేలా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: