హరికృష్ణ పెట్టిన టార్చర్ ను బయటపెట్టిన కళ్యాణ్ రామ్ !

Seetha Sailaja
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలలో నందమూరి కళ్యాణ్ రామ్ చాల సీనియర్. సుమారు పుష్కర కాలం క్రితం కళ్యాణ్ రామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఇంకా సరిగ్గా నిలదొక్కుకోలేక సమస్యలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. సామాన్యంగా చదువు పట్ల పెద్దగా శ్రద్ధ లేనివారు సినిమాల వైపు వస్తూ ఉంటారు. అయితే కళ్యాణ్ రామ్ కు చిన్నప్పటి నుంచి చదువులో 90 శాతం మార్కులు వచ్చినా అతడి దృష్టి సినిమాల వైపే కొనసాగింది. 

కళ్యాణ్ రామ్ అభిరుచిని పసిగట్టిన హరికృష్ణ అతడి భార్య ఎప్పుడూ కళ్యాణ్ రామ్ తెచ్చుకుంటున్న మార్కులు ఏమాత్రం బాగాలేవని చెపుతూ నిరంతరం తిట్టడమే కాకుండా కొట్టిన సందర్భాలను కూడ కళ్యాణ్ రామ్ బయటపెట్టాడు. "చదువే జీవనాధారం. కాబట్టి చిన్నప్పటినుండి మా అమ్మ ఎప్పుడు బాగా చదువుకోవాలి అని చెప్తూ ఉండేవారు. 90 శాతం మార్కులు వచ్చినా ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి’ అంటూ కేకలు వేసేవారు. 

ఇంజనీరింగ్ పూర్తి కాగానే తాను నిర్మాతగా కాని హీరోగా కాని మారుదాము అనుకుంటే తన అభిరుచులను పట్టించుకోకుండా తన తండ్రి హరికృష్ణ ఉన్నత విద్యల కోసం విదేశాలకు పంపిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ తన తండ్రికి భయపడి తాను పెద్ద చదువులు చదివాను అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు కళ్యాణ్ రామ్. ఆతరువాత ఏదోవిధంగా తన తండ్రిని ఒప్పించి సినిమాలలోకి వస్తే తన మొదటి రెండు సినిమాలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో తన తండ్రి హరికృష్ణ తనను తిట్టిన విషయాన్ని  బయటపెట్టాడు కళ్యాణ్ రామ్.

అంతేకాదు తాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించిన తరువాత ఒక సినిమా హిట్ అవ్వగానే తాను సినిమాల మాయలో పడిపోతానని తన తండ్రి హరికృష్ణ ఒక అమ్మాయిని చూపించి పెళ్లి చేసుకోమని పట్టుపట్టిన విషయాన్ని వివరిస్తూ తనకు కొంత సమయం కావాలి అని చెప్పినా పట్టించుకోకుండా తన తండ్రి తనకు అప్పట్లో బలవంతంగా పెళ్లి చేసిన విషయాన్ని నవ్వుతూ గుర్తుకు చేసుకున్నాడు. ఈరోజు విడుదలైన ‘ఎం.ఎల్.ఎ.’ మూవీకి డివైడ్ టాక్ వచ్చిన నేపధ్యంలో కళ్యాణ్ రామ్ ఈమూవీ ఫైనల్ రిజల్ట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: