పవన్ భయంలో ఆంతర్యం !

Seetha Sailaja
ఈరోజు గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా 35 ఎకరాల విస్తీర్ణంలో జరగబోతున్న ‘జనసేన’ పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షల సంఖ్యలో పవన్ అభిమానులు ఈ సమావేశానికి వస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థుతుల నేపధ్యంలో పవన్ నిన్న ఆంధ్రప్రదేశ్ డిజీపీ కి వ్రాసిన లేఖ పై అనేక చర్చలు జరుగుతున్నాయి. 

తన పై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే భయాలను పవన్ వ్యక్తం చేస్తూ తనకు పూర్తి రక్షణ కావాలని ఆలేఖలో పవన్ కోరాడు. గతంలో భీమవరంలో ఫ్లెక్సీ చింపేసినందుకే అభిమానులు ధర్నా చేశారని ఇటీవల అనంతపురం పర్యటనలో తొక్కిసలాట జరిగిన దృష్ట్యా భద్రత కోరుతున్నానని చెపుతూ ఏదైనా తేడా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అంటూ పవన్ వ్రాసిన లేఖ సంచలనంగా మారింది. 

దీనితో పవన్ ఎందుకు తనపై దాడి జరగొచ్చని అనుమానిస్తున్నాడు అన్న సందేహాలు కొందరు వ్యక్త పరుస్తున్నారు. మరికొందరైతే పవన్ కు నిజంగా ఇటువంటి సంకేతాలు ఏమైనా వచ్చాయా లేదంటే జనంలో సానుభూతి పొందడానికి ఇలాంటి వ్యూహాలు పవన్ రచించాడా అన్న అనుమానాలు కూడ మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా నిన్న సాయంత్రం నుండి పవన్ పై కత్తి మహేష్ చేస్తున్న మాటల దాడి తారా స్థాయికి చేరిపోయింది. ‘జనసేన’ పార్టీ ప్రారంభంలోనే బానిసత్వం పార్టీ కార్యాలయం పునాదిలోనే అవినీతి ఉందని కత్తి మహేష్ చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. అదేవిధంగా పవన్ సొంత ఇంటి నిర్మాణం పై కత్తి మహేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో తన విమర్శకులకు అదేవిధంగా తన ‘జనసేన’ ఒక సిద్దాంతం లేదు అని కామెంట్ చేస్తున్న చాలామందికి పవన్ ఈరోజు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతే ఎంతో భారీ స్థాయిలో జరుగుతున్న నేటి ‘జనసేన’ సభ వల్ల పవన్ కు ఏమాత్రం ఇమేజ్ పెరగదు అని విశ్లేషకుల భావన.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: