ఏమయ్యా పవన్ కల్యాణ్...ఏందిదీ..ఇంతేనా..!

siri Madhukar
ఆ మద్య సోషల్ మీడియాలో ప్రతిరోజు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఫైట్ అంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తు వచ్చాయి.  అప్పటి వరకు కత్తి మహేష్ అంటే ఎవరో తెలియని వారు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ‘బిగ్ బాస్’ తో పరిచయం అయ్యారు.  ఇదిలా ఉంటే ఆ మద్య కత్తి మహేష్ తన ఫేస్ బుక్ లో పవన్ కళ్యాన్ రాజకీయాలపై విమర్శలు చేశారు. అంతే..తెల్ల వారి నుంచి కత్తిని టార్గెట్ చేసుకొని పవన్ ఫ్యాన్స్ బండ బూతులు తిడుతూ..మెసేజ్ లు పెట్టారు.

కొంత మంది యూట్యూబ్స్ లో బెదిరించారు..తిట్టారు..నానా యాగీ చేశారు. ఇలా నాలుగు నెలలు ఎవ్వరూ తగ్గకుండా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారారు.  రీసెంట్ గా కత్తి మహేష్ పై కోడి గుడ్ల దాడి చేసిన పవన్ ఫ్యాన్స్ పై కేసు పెట్టాలని వెళ్లిన కత్తి మహేష్ మనసు మార్చుకున్నారు..దీంతో జనసేన పార్టీ సభ్యులు కొంత మంది తో కాంప్రమైజ్ అయ్యారు..సెల్ఫీ కూడా దిగారు. అంతటితో ఈ ఎపిసోడ్ కి పులిస్టాప్ పడిందని భావించారు..కానీ మహేష్ తాజాగా చేస్తున్న ట్వీట్స్ చూస్తుంటే అది ఫుల్‌స్టాప్ కాదేమో.. కామా మాత్రమేనేమో అనిపిస్తోంది.

పవన్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరో విమర్శ చేశారు.‘‘నాయుడు, రాయల్, కాపు పిల్లల్లారా.. పవన్ కల్యాన్‌ని రాజకీయంగా నమ్మే ముందు చిరంజీవి కాపు కులానికి చేసిన మోసం గురించి మీ తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకోండి. సినిమా పరిశ్రమల్లోనూ.. రాజకీయాల్లోనూ కాపులకి చిరంజీవి ఫ్యామిలీ చేసిందేమీ లేదు.

ముద్రగడ పద్మనాభం అసలైన లీడర్ వీళ్లు కాదు’’ అంటూ బుధవారం ట్వీట్ చేసి చిన్నపాటి దుమారాన్ని రేపారు. ‘‘ఎన్నికల్లో మాత్రం టీడీపీ-బీజేపీకి నువ్వు సపోర్టు. ఇప్పుడు మాత్రం నీకు కాంగ్రెస్, వామపక్షాలు, వైఎస్సార్ కాంగ్రెస్ సపోర్టు కావాలి. ఏమయ్యా పవన్ కల్యాణ్.. అంతేనా’’ అని కత్తి మహేష్ కొద్ది నిమిషాల క్రితం ట్వీట్ చేశారు.  దీంతో పవన్ ఫ్యాన్స్ మరోసారి హర్ట్ అయ్యారు..మరి ఈసారి ఎలా టార్గెట్ చేస్తో చూడాలి. 
నాయుడు. రాయల్. కాపు. పిల్లల్లారా...పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా నమ్మే ముందు. చిరంజీవి కాపు కులానికి చేసిన మోసం గురించి మీ తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకొండి. సినిమా పరిశ్రమలోను. రాజకీయాల్లోనూ కాపులకి చిరంజీవి ఫ్యామిలీ చేసింది ఏమీ లేదు. ముద్రగడ పద్మనాభం అసలైన లీడర్. వీళ్లు కాదు.

— Kathi Mahesh (@kathimahesh) February 14, 2018 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో చిచ్ఛు. కాపు రిజర్వేషన్ కు ప్రాతిపదిక చెప్పని రాష్ట్ర ప్రభుత్వం. అంగీకరించని కేంద్ర ప్రభుత్వం. మాటవిప్పని పవన్ కళ్యాణ్.https://t.co/lhcWAIBXYl

— Kathi Mahesh (@kathimahesh) February 15, 2018

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: