ఆ సినిమాల్లో నేను నటించను : నాని

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నానీ ‘అష్టాచమ్మ’ చిత్రంతో హీరోగా మారారు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకున్నా కామెడీ దర్శకులు మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. అంతే కాదు ఆ సినిమా తర్వాత మనోడికి గోల్డెన్ టైమ్ మొదలైంది.

వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకు వెళ్తున్న నాని ప్రస్తుతం  'అ!' సినిమాతో నిర్మాతగాను రంగంలోకి దిగాడు.  విభిన్నమైన కంటెంట్ తో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 16వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది.  ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు నన్ను నటుడిగా ప్రోత్సహిస్తూ వచ్చారని..నిర్మాతగా కూడా తనను దీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫైనల్ కట్ ఈ రోజు ఉదయమే చూశానని, దర్శకుడు ప్రశాంత్ వర్మ చాలా బాగా తీశాడని అన్నాడు.

ఇకపై సొంత బ్యానర్లో వరుస సినిమాలను నిర్మించే ఆలోచనలో వున్నానని చెప్పాడు.కొత్త దర్శకుల టాలెంట్ కి .. కంటెంట్ కి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించుకున్నానని అన్నాడు. సొంత బేనర్లో తీసే సినిమాలలో తాను నటించననీ .. నిర్మాణంపై మాత్రమే దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. భవిష్యత్ లో దర్శకత్వం చేయాల్సి వస్తే మంచి కథ ఉంటే చేస్తానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: