ఏం మాయ చేశావ్... ప్రియా..!!

Vasishta

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఇప్పుడు ఈ పేరు తెలియని కుర్రకారు లేదేమో.! ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేదు.. తనకున్న ఆసక్తికొద్దీ సినిమాల్లోకి ఎంటరైంది. ఫస్ట్ సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇంతలో రిలీజైన ఒక్క టీజర్.. ఆ అమ్మాయికి ఒక్కసారిగా స్టార్ డమ్ తెచ్చేసింది. అలాంటిలాంటి స్టార్ డమ్ కాదు.. దిమ్మదిరిగిపోయే స్టార్ డమ్.!


సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రియా ప్రకాష్ వారియర్ పేరే వినిపిస్తోంది. ఒక్క రోజులో ఆరు లక్షల మంది ఫాలోవర్లను సాధించుకోవడమంటే మామూలు విషయం కాదుగా మరి.! అందుకే ఆ పిల్ల ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండియాగా మారిపోయింది. ‘ఒరు ఆదార్ లవ్’ సినిమాలో నటిస్తున్న ప్రియ ప్రకాశ్ వారియర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ పిల్ల సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.. మూడ్రోజుల క్రితం రిలీజైన పాటలో... రెండు కనురెప్పలనూ లయబద్దంగా ఎగరేసి... ప్రియా ప్రకాశ్ సృష్టించిన అలజడి కుర్రాళ్ల గుండెల్లో చిచ్చుపెట్టింది.


ఇంతలోనే.. ప్రేమికుల ముందు రోజు మరో చిచ్చు కూడా రేపిందీ పిల్ల. మొన్న కన్ను కొట్టి అగ్గిరాజేస్తే.. నిన్న ఏకంగా ఫ్లైయింగ్ కిస్ తో చంపేసింది. హీరోహీరోయిన్ ఇద్దరి మధ్య ఆలింగనాల్లేవు.. హాట్ సీన్స్ అసలే లేవు.. కేవలం హావభావాలే..! కనురెప్పలతో చేసిన సంచలనం మర్చిపోకముందే.. చేతివేళ్లే ఆయుధంగా బుల్లెట్ కిస్ ఇచ్చిన తీరు చూసి సినీ ప్రేక్షకులు తెగ ముచ్చటపడిపోతున్నారు. కన్నుకొట్టింది.. కిస్సిచ్చింది.. మరి వాట్ నెక్స్ట్..?


మాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ప్రియా ప్రకాష్ వారియర్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందరు హీరోలూ ఇప్పుడు ఆ పిల్లదాని చిలిపి చేష్టలకు ఫిదా అయిపోయారు. కొంటెగా కన్నుగీటితూ… సన్నగా నవ్విన అర నవ్వులకు మొత్తం పడిపోయారు.. ఆ కళ్లు మనసును కట్టి పడేస్తుంటే... ఆ నవ్వు గుండెల్ని పిండేస్తోంది.. అరచేతిని అడ్డుపెట్టి అందాన్ని ఆపడం ఎవరి తరం..?


‘ఏం పిల్లరా బాబూ.. ఒక్క చిరు నవ్వుతోనే పిచ్చివాడిని చేసేసింది.’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆ చిన్నదాని చూపునకు.. చిరు నవ్వుకు లైక్‌లు, కామెంట్లు, షేర్లు ... ఇవే ఇప్పుడు ఆ పిల్ల పర్ఫార్మెన్స్ కు గీటురాయిగా మారిపోయాయి. కొంతమందైతే.. ఆ పిల్లపైన వీడియోలు తీసేస్తున్నారు. కన్నుకొట్టడం, కిస్సివ్వడం.. లాంటి వాటితో ఆమె పలికించిన హావభావాలతో కుర్రోళ్లు గింగిరాలు కొట్టుకుంటున్నారు..


అయితే.. ఈ సినిమాకు ఇప్పుడు చిక్కొచ్చిపడింది. ఈ సినిమాలో ముస్లిం మనోభావాలు కించపరిచేలా ఉన్నాయంటూ కొంతమంది హైదరాబాద్ లో కేసు పెట్టారు. అయితే సినిమా యూనిట్ మాత్రం ధీమాగా ఉంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: