మహామహులకే నిద్ర పట్టనివ్వని అందాల రసజ్ఞి మాధురి దిక్షిత్
ఈ జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత "లెజెండరీ బ్యాడ్మింటన్ ప్లేయర్" మరో ప్రఖ్యాత నటి, అందల రాశి దీపికా పదుకొనే తండ్రి, ప్రకాశ్ పదుకొనే కూడా ఉన్నారట. ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని ప్రకాశ్ పదుకునే గురించి ఒక సీక్రెట్ ఆయన ముద్దుల తనయ దీపికా పదుకునే ఒక కార్యక్రమంలో వెల్లడించింది. మాధురీ దీక్షిత్ కు తన తండ్రి వీరాభిమాని అని, మాధురికి పెళ్లి అయినపుడు ఆయన చాలా బాధపడ్డారని దీపిక తెలిపింది. ఆ బాధ ఏ స్థాయిలోనిదంటే, మాధురి పెళ్లి గురించి మీడియా లో వార్త చూడగానే ఆయన బాత్రూం లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడట. కాసేపటి తర్వాత ఆయన బయటికి రాగా, కళ్లు వాచిపోయి ఉన్నాయని, దాన్ని బట్టే ఆయన లోలోపల ఎంతగా బాధ పడి, ఏడ్చారో? అర్థమైందని దీపిక వెల్లడించింది.