సినీనటి కృష్ణకుమారి కన్నుమూత..!

Edari Rama Krishna
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ఒకప్పటి అందాలతారగా పేరు పొంది..సావిత్రి, జమున లకు ధీటుగా ఎన్నో అద్భుమైన సినిమాల్లో నటించి మెప్పించిన నటిమణి కృష్ణకుమారి కన్నుమూశారు.    సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో నటించి గొప్ప పేరు తెచ్చుకున్నారు కృష్ణ కుమారి. పశ్చిమ బెంగాల్ లో 1933, మార్చి 6న నైహతిలో జన్మించారు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఆమె సోదరి షావుకారు జానకి కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. 

సుమారు 110 పైగా తెలుగు సినిమాలలో నటించింది. కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన అజయ్ మోహన్‌ను పెండ్లాడింది. తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు యన్.ఎ.టి.వారి పిచ్చి పుల్లయ్యలో కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టిగారి పల్లె పడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.

1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిద్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి అంతస్థులులో నాయికగా నటించారు. 1967-68 మధ్యకాలంలో ఉమ్మడి కుటుంబం, భువనసుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిద్యమున్న పాత్రలు పోషించారు. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించగలిగారు. సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 110 సినిమాలలో నటించింది.   

15 కన్నడ చిత్రాలు మరియు కొన్ని తమిళ భాషా చిత్రాలు. ఈమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించింది. నటి కృష్ణ కుమారికి మూడుసార్లు జాతీయ అవార్డులు, రాష్ట్రస్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఈమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు గెలుచుకున్నది. బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ వారి లైఫ్ టైం అచీవ్‍ట్ అవార్డు పోందినది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: