సినీ పరిశ్రమలో హీరోయిన్లపై లైంగిక వేధింపులు ఉన్నాయి..!

Edari Rama Krishna
ఆ మద్య మాలీవుడ్ సినీ నటి భావన పై ఆమె కారు డ్రైవర్ కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం తెలిసిందే.  అయితే ఈ విషయంపై భావన పెద్ద ఎత్తున గొడవ చేసింది..ఆమెకు మద్దతుగా అన్ని ఇండస్ట్రీలో ఏకమయ్యాయి.  మొత్తానికి తనపై కుట్ర చేసిన వారిని, లైంగిక దాడి చేసిన వారిని కటకటాల పాలు చేసింది. ఇక భావన ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుకొని తర్వాత ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లు తమపై జరిగిన లైంగిక దాడులను ఒక్కొక్కటిగా వెలిబుచ్చారు. 

తాజాగా సినీపరిశ్రమలో వేధింపులపై మరో తార తన అనుభవాలను బయటపెట్టింది. ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడిన కన్నడ నటి శ్రుతి హరిహరన్.. ఇండస్ట్రీలో తొలి రోజు నుంచే వేధింపులు ఎదురయ్యాయని చెప్పింది.  సెక్సిజం ఇన్ సినిమా అనే అంశంపై జరిగిన చర్చలో.. తనపై జరిగిన వేధింపులను బయటపెట్టి సంచలనం సృష్టించింది.

ఇండియా టుడే కాంక్లేవ్‌ బహిరంగ వేదికపై సినీపరిశ్రమలో ఎదురైన వేధింపులను బయటపెట్టిన శ్రుతి కలకలం సృష్టించింది. సెక్సిజం ఇన్ సినిమా, టైమ్సప్.. అనే అంశంపై జరిగిన చర్చలో పానలిస్టుగా పాల్గొన్న శ్రుతి సినీ ఒక టాప్ తమిళ సినీ నిర్మాత తనకు ఎలాంటి ఆఫర్ ఇచ్చాడో చెప్పింది. తాను ఇచ్చిన ఆఫర్ కాదన్నందుకు ఆ నిర్మాత తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అంతే కాదు తాను నిర్మాతలకు సరిగా సహకరించదని చెప్పడంతో తమిళ పరిశ్రమ నుంచి మంచి సినిమాలు రావడం ఆగిపోయాని చెప్పింది శ్రుతి. 18 ఏళ్లకే కన్నడ సినిమాల్లో డాన్సర్‌గా అడుగు పెట్టినపుడు కొరియోగ్రాఫర్ తిట్టడంతో కన్నీళ్లు పెట్టానంది.  తనకు మంచి గుర్తింపు రాకపోవడంతో..సినిమా కెరీర్ చాలా కష్టమైందని అన్నారు. ఇండియా టుడే చర్చలో ఫిల్మ్ ఎడిటర్ బీనా పాల్, నటి ప్రణీత కూడా పానలిస్టులుగా పాల్గొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: