ప్రభాస్ తో సంబంధాన్ని చెప్పేసిన అనుష్క..!

Vasishta

అనుష్క – ప్రభాస్ .. పేరు వినగానే బాహుబలి గుర్తొస్తుంది. ఇప్పుడు అంతకుమించి వారిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. వాళ్లిద్దరికి త్వరలోనే పెళ్లి కూడా జరగబోతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే వాళ్లిద్దరూ మాత్రం దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు.. అలాగని ఖండించలేదు. ఈ నేపథ్యంలో అనుష్క.. ప్రభాస్ తో సంబంధంపై కామెంట్ చేసింది.


అనుష్క నటించిన తాజా సినిమా భాగమతి. అరుంధతి తర్వాత సిల్వర్ స్క్రీన్ పై అనుష్క భయపెట్టబోతోంది. బాహుబలి తర్వాత అనుష్క సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది చాలా తక్కువ. పైగా భాగమతి ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో దానిపై హోప్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్స్ కోసం అనుష్క తెగ తిరిగేస్తోంది. చెన్నైలో ఈ సినిమా ప్రమోషన్ కోసం ఓ కార్యక్రమంలో పాల్గొంది.


చెన్నై మీటింగ్ లో అనుష్క ఆసక్తికరమన విషయాలు మాట్లాడింది. తనకో మంచి అబ్బాయిని చూసి పెట్టాలని మీడియాను కోరింది. ఇప్పటివరకూ పెళ్లి గురించి ఆలోచించలేదన్న అనుష్క.. సమయం వచ్చినప్పుడు దానంతట అది జరుగిపోతుందని తెలిపింది. ఇక ప్రభాస్ తో సంబంధంపైనా తనే కలుగజేసుకుని స్పందించింది. ప్రభాస్ ను తాను అన్నయ్యలా ఊహించుకోలేనని, అలా పిలవలేనని స్పష్టం చేసింది. అందరు అబ్బాయిలను మనం అన్నయ్యలుగా భావించలేం. ప్రభాస్ కూడా అంతే.! ప్రభాస్ నాకో మంచి ఫ్రెండ్.. అని తేల్చేసింది.


ప్రభాస్ కు అనుష్కకు మధ్య ఏదో ఉందని.. వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా డేటింగ్ చేసుకుంటున్నారని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు కూడా కొంతమంది ఇండస్ట్రీ వర్గాలే క్లారిటీ ఇచ్చాయి. అయితే వారిద్దరూ మాత్రం ఇంకా కన్ఫామ్ చేయలేదు. అయితే అనుష్క మాత్రం తాను అలాంటివేవీ పట్టించుకోనని తేల్చేసింది. ఎందుకంటే అసలు తాను మీడియాను కానీ, పేపర్లు కానీ చూడదంట. అందుకే తన వరకూ అలాంటివి రావని తెలిపింది. అయితే ప్రభాస్ ను మాత్రం అన్నయ్యా అని పిలవలేనని క్లారిటీ ఇచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: