ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ కన్నుమూత..!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన అలనాటి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ (79) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. న‌టుడిగానే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా ఆయ‌న రాణించారు. ఆయ‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. 1938 మార్చి 18న కోల్‌క‌తాలో శ‌శిక‌పూర్ జ‌న్మించారు. 1941 నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న న‌ట ప్ర‌స్థానం 1999 వ‌ర‌కు కొన‌సాగింది.

సంగ్రామ్ (1950), దనపాణి (1953) లాంటి వ్యాపారాత్మక చిత్రాల్లో బాల నటుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు.   2010లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాప‌ల్య పుర‌స్కారం, 2011లో ప‌ద్మ భూష‌ణ్ అవార్డు, 2015లో దాదాసాహెబ్ పాల్కే పుర‌స్కారం ల‌భించాయి. శశికపూర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ధర్మపుత్ర. ఆయన చివరి చిత్రం సైడ్‌ స్ట్రీట్స్‌ (1999). మొత్తం 61 సినిమాల్లో ఆయ‌న పూర్తిస్థాయి హీరోగా న‌టించారు.  ఆగ్‌ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు.

శశికపూర్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ధర్మపుత్ర. ఆయన చివరి చిత్రం సైడ్‌ స్ట్రీట్స్‌ (1999).  కబీ కబీ, దుస్‌రా ఆద్మీ, జమీన్‌ ఆస్మాన్‌ లాంటి పలు హిట్‌ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. అమితాబ్‌తో కలిసి శశికపూర్‌ దివార్‌, నమక్‌ హలాల్‌ చిత్రాల్లో నటించారు. పాతతరం కథానాయకుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ మూడో కుమారుడే శశికపూర్‌. మరోవైపు శశికపూర్‌ మృతి పట్ల బాలీవుడ్‌ విషాదంలో ముగినిపోయింది. బాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు సంతాపం తెలిపారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: