వెంకీకి ఆ కథ బాగా నచ్చిందట..!

veeru

తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూస్ రామానాయుడు వారసుడు విక్టరీ వెంకటేష్ ‘కలియుగ పాండవువులు ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలం  యాక్షన్ తరహాగా వచ్చినా..తర్వాత ఫ్యామిలీ హీరోగా మారారు.  తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వెంకటేష్ దృశ్యం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘గురు’ చిత్రంతో ముందుకు వచ్చారు.  ఈ చిత్రం ఆయన కెరీర్ లో అద్భుత విజయం సాధించింది. 


ఇండస్ట్రీలో  యువ  హీరోలకు కథలు తయారుచేయడం కంటే  సీనియర్‌ హీరోలకు కథలు రూపొందించడం దర్శకులకు, రచయితలకు కత్తి మీద సామే. యువ హీరోల్లో గ్లామర్‌ ఎక్కువ కాబట్టి లవ్వు, ఫైట్లతో లాగించేయొచ్చు. కాని సీనియర్‌ హీరోల విషయంలో ఇది వర్కవుట్‌ అవదు. వారి వయసును, సీనియారిటీని దృష్టిలో పెట్టుకొని కథలు తయారుచేయాల్సివుంటుంది.


సరైన కథలు దొరకనప్పుడు రీమేక్స్‌ మీద ఆధారపడతారు. విక్టర్‌ వెంకటేష్‌ అలియాస్‌ వెంకీ 'గురు' సినిమా తరువాత మరో సినిమా చేయలేదు. కారణం సరైన కథ దొరక్కపోవడమే. సీనియర్‌ దర్శకులు చాలామంది దర్శకత్వానికి దూరం కావడంతో వెంకీవంటి హీరోలను డైరెక్ట్‌ బాధ్యత కొత్త దర్శకులు తీసుకుంటున్నారు.


ఈయన కోసం ప్రస్తుతం కల్యాళ్‌ కృష్ణ కురసాల కథ తయారుచేస్తున్నాడు. సోగ్గాడే చిన్ననాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం సినిమాల తరువాత వెంకీని డైరెక్ట్‌ చేయాలని పట్టుదలగా ఉన్నడు కళ్యాణ్‌. ఓ పక్క రీమేక్‌ ఆలోచన ఉన్నప్పటికీ కళ్యాణ్‌ కథ నచ్చిందట వెంకీకి. ఏవిధంగా ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: