అమితాబ్ కు రజతోత్సవ జన్మదిన శుభాకాంక్షలు: ఇండియా హెరాల్డ్ గ్రూప్

విశ్వవినీల చలనచిత్రాకాశంలో దివ్యకాంతులతో ప్రకాసించే దృవతార అమితాబ్ బచ్చన్. అమితాబ్ 11-10-1942న జన్మించారు అంటే నేడే ఆయన జన్మదినం. 75వ వసంతంలోకి అడుగెట్టే ఈ చలనచిత్ర కళాకారుడు అమితాబ్ అసలు పేరు ఇంక్విలాబ్ శ్రీవాస్తవ. ఆ తర్వాత ఆయన తండ్రి "నిత్యం ప్రకాశించు" అనే అర్థం వచ్చేలాగా "అమితాబ్" అంటూ తనకుమారుని పేరును మార్చారు. అలాగే తండ్రి ఆశయం ప్రకారం నిత్యం ప్రకాశిస్తూనే ఉన్నారు. 



కుటుంబాన్ని ప్రేమించే ప్రముఖుల్లో ఆయన ముందుంటారు. 1969లో "వాయిస్ నెరేటర్‌" గా సినిమా రంగంలోకి పరిచయ మైన అమితాబ్ "సాత్ హిందుస్థానీ" సినిమాలో లో ఒక చిన్న పాత్రలో నటుడుగా కనిపించారు. "ఆనంద్" (1971) సినిమాలో సపోర్టింగ్ పాత్రలో నటించి ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు పొందారు. అయితే 1973లో "జంజీర్" సినిమా ఆయన చ్లనచిత్ర జీవితాన్ని ఒక మలుపు తిప్పి, ఆయనను "యాంగ్రీ యాంగ్ మ్యాన్" ను చేసింది. అప్పటినుండి 1982 వరకు ఆయన చిత్రరంగ జీవితం అద్భుతం గా కొనసాగింది. "కూలీ" సినిమా షూటింగ్ యాక్సిడెంట్ తర్వాత ఆయన శరీరకంగా మానసికంగా కుంగ దీసింది.


1984 నుంది సినిమాలకు స్వల్ప విరామం ఇచ్చి తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాజీవ్ గాంధీకి ఆసరాగా నిలబడ్డారు అదీ ఇందిరాగాంధి మరణంతో చలించి పోయి. 8వ లోక్‌సభ ఎన్నికల్లో అలహాబాద్ నియోజక వర్గం లో భారీ మెజారిటీతో గెలిచారు. అనుకోని పరిణామాలతో ఆయన బోఫోర్స్ కేసులో ఇరుక్కొని చివరకు నిర్దోషిగా బయటపడ్డారు. రాజకీయాలు "మురికి గుంట" గా గుర్తించి తన పదవికి రాజీనామా చేశారు. 




ఆ తరవాత 1988 లో రెందో సారి చిత్ర జగత్తులోకి ప్రవేసించారు. 1992లో "ఖుదాగవ" సినిమా తర్వాత ఐదేళ్ల పాటు సినిమాలు చేయలేదు. 1996-99 మధ్య నిర్మాతగా 'అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్' -  "తేరే మేరే సప్నా" తో ప్రారంభించా రు. ఈ సినిమా ఫ్లాప్ అయి, నటి సిమ్రాన్‌ కు మాత్రమే బాగా కలిసివచ్చింది.  ఏబీసీఎల్ పతాకం పై నిర్మించిన ఏ ఒక్క సినిమా కూడా పెద్దగా విజయాలు సాధించలేదు. ఈ పరిస్థితుల్లో ఆర్ధికంగా గట్టెక్కటానికి ఆయన "మ్రుత్యుదాత"  సినిమా తో మూడోసారి సినీ రంగ ప్రవేశం చేసశారు. అదీ ఒక ధారుణ డిజస్టర్‌గా చరిత్రలో నిలిచిపోయింది. "1996 మిస్ వరల్డ్ బ్యూటీ కంటెస్టు - బెంగళూరు"కు స్పాన్సర్‌ గా వ్యవ హరించిన ఏబీసీఎల్.. మరింత నష్టపోయింది. చివరికి ఆయన నివసించే బంగ్లా కూడా అమ్ముకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి అమితాబ్ ఆర్థికంగా చితికి పోయారు. 



2000 సంవత్సరంలో యాష్ చోప్రా నిర్మించిన ‘మహోబత్తై’ చిత్రంతో అమితాబ్ తన తొలి స్టార్‌డమ్ ను తిరిగి పొందారు. ఆ తర్వాత వెనుతిరిగి చూసిందిలేదు. 2000 సంవత్సరం లోనే "కౌన్ బనేగా కరోడ్ పతీ" 9కెబిసి) టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి మంచి ప్రేక్షకాదరణను సాధించిపెట్టారు. నటుడిగా, గాయకుడిగా గతంలోనే తానేమిటో నిరూపించు కున్న అమితాబ్, ఆ తర్వాత అద్భుతమైన వ్యాఖ్యాత గానూ గుర్తించబడ్డారు. 


అమితాబ్ ఎవరికైనా సాయం చేయడానికి సర్వదా ముందుంటారు. అనేక సామాజిక సంస్థలు, వివిధ మాధ్యమాలకు ఆయన ఆర్థికంగా చేయూత నివ్వడమే కాకుండా వారు తల పెట్టే అనేక కార్యక్రమాల్లో తానే స్వయంగా పాల్గొని విజయం సాధించి "బిగ్ బి" (పెద్దన్న) అన్న పేరును సార్ధకం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఋణాలు తీర్చలేక ఇబ్బందు ల్లో ఉన్న రైతులను ఆర్ధిక సహకారం అందించారు.

హిమోన్నతమైన అమితాబ్ మనసూ హిమాలయమంత ఎత్తు. ఈ పడి లేచిన కెరటానికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూంది  "ఏపి హెరాల్డ్"  ఈ 75 వసంతాల యువకుడు నూరేళ్ళ జీవితాన్ని ఆస్వావిస్తూ మనకు ఆఖరి శ్వాస వినోదాన్ని అందించాలని ఆశిస్తూంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: