బూతు వెబ్‌సైట్ల నిర్వాహకుడు.. దాసరి ప్రదీప్‌ అరెస్ట్‌..!

Edari Rama Krishna
సినీ ప్రముఖుల గురించి అసభ్యకర, అభ్యంతరకర రాతలు రాస్తూ, హిట్ల ద్వారా సొమ్ములు చేసుకుంటోన్న వెబ్‌సైట్లపై సైబర్ పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది.  సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లు అభూత కల్పన సృష్టిస్తున్నారు.సినిమా ఇండస్ట్రీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు..ఏ ఇండస్ట్రీలో చిన్న విషయం జరిగినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

అంతే కాదు కొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ లేనిది ఉన్నట్లుగా సృష్టించి ఇమేజ్ దెబ్బ తీస్తున్నారని  అభ్యంతరకర వ్యాఖ్యలతో  పోస్ట్ లు చేస్తున్న వెబ్ సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిచిన పోలీసులు అశ్లీల వెబ్ సైట్లపై ఐటీ యాక్ట్ 67, 67ఏ కిందు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.   

ఈ నేపథ్యంలో  హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్న వెబ్‌సైట్లపై కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం.సినిమా హీరోయిన్లు, ఇతర నటీమణుల ఫొటోలు, వీడియోలకు అసభ్యపదజాలాన్ని జోడించి అశ్లీలతను ఎగజిమ్ముతోన్న దాసరి ప్రదీప్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు కేంద్రంగా నాలుగు అశ్లీల వెబ్‌సైట్లు నిర్వహిస్తోన్న ప్రదీప్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

మరోవైపు సీఐడీ సైబర్‌ సెల్ పోలీసుల ప్రాథమిక విచారణలో మొత్తం 248 వెబ్‌సైట్ల వరకు వెలుగులోకొచ్చాయి. ఆయా వెబ్‌సైట్ల నిర్వాహకులన్నింటిపైనా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ విచారణలో భాగంగానే తమ దృష్టికి వచ్చిన నాలుగైదు వెబ్‌సైట్లని బెంగళూరు నుంచి నిర్వహిస్తున్న దాసరి ప్రదీప్‌ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు సైబర్ సెల్ ఎస్పీ రామ్మోహన్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: