ఉయ్యాల బ్యూటీ చూస్తే..నిజంగా షాక్ తింటారు..!

Edari Rama Krishna
బుల్లితెరపై వచ్చిన ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ లో నటించి భారత దేశం వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ అవికా గోర్.  తెలుగు లో రాజ్ తరుణ్ సరసన ‘ఉయ్యాల..జంపాల’ చిత్రంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఈ అమ్మడికి పెద్దగా పేరు తీసుకు రాకపోయినా..అవికా అందానికి చాలా మంది ఫ్లాట్ అయ్యారు.  

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు తాజాగా ఓ ఫోటో షూట్ తో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.  నిన్న మొన్నటి వరకు ముద్దుగా బొద్దుగా ఉన్న అవికా ఒక్కసారే జీరో సైజ్ లో కనిపించే సరికి అందరూ షాక్ తిన్నారు. చిన్నారి పెళ్లి కూతురు సినిమాతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అవికా ఇప్పుడు బాలీవుడ్ లో నటించేందుకు బాగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.  

అయితే  కాస్త బొద్దుగా ఉందనే టాక్ రావడంతో  అవికా కి ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి.  దీంతో చాలా కఠినమైన ఎక్ససైజ్ లు, డైట్ చేస్తూ  పూర్తిగా బక్క చిక్కి గుర్తు పట్టలేనట్టు మారింది అవికా. క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఈమె అవికా అని గుర్తు పట్టడం కష్టం. మరి ఈ అమ్మడికి తెలుగు, హిందీ సినిమాల్లో చాన్సులు వస్తారా రావా అన్న విషయం తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: