ఇవాల్టి సిట్ విచారణ చాలా కీలకం .. తరుణ్ ని ఒక హీరోగా విచారణకి పిలవలేదు .. దందా మొత్తానికి అతనే మెయిన్ ?

KSK

టాలీవుడ్ హీరో , చిన్నప్పటి నుంచీ తన యాక్టింగ్ తో పెద్దయ్యాక హీరోగా మనందరికీ తెలిసిన హీరో తరుణ్ ప్రస్తుతం సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. మాస్టర్ తరుణ్ గా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన నితిన్ ఇప్పుడు సినిమాల్లో పెద్దగా రాణించడం లేదు. నిజానికి క్రికెటర్ అవ్వాలి అనుకున్న తరుణ్  ఆ తరవాత హీరోగా సెటిల్ అయ్యాడు.


సినిమా ఛాన్స్ లు తగ్గిన తరవాత సొంతగా పబ్ ని నడుపుతున్నాడు . డ్రగ్ మాఫియా తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్న వేళ తరుణ్ ఓనర్ గా ఉన్న పబ్, అతని ప్రవర్తనా రెండూ నిశితంగా పరిశీలించడం కోసం ఇవాళ సిట్ అతన్ని విచారించ బోతోంది. ఇతని పబ్ నుంచే ఇతర పబ్ లకి డ్రగ్స్ సరఫరా జరుగుతోంది అంటూ సిట్ అధికారులు అనుమానిస్తున్నారు.


ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని తన తండ్రి ని తీసుకుని తరుణ్ నాంపల్లి చేరుకున్నాడు. పూరీని 13 గంటలు, శ్యామ్ కే నాయుడును 11 గంటలు, సుబ్బరాజును 13 గంటలు విచారించిన సిట్ అధికారులు తరుణ్ ను ఎంతసేపు విచారించనున్నారో తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: