"బాహుబలి ది కంక్లూజన్" తో సమాజములో పెరగనున్న నేర ప్రవృత్తి- పైరసీ



బాహుబలి ధర్మమా అని సినిమా టిక్కెట్స్ అధికారిక ధరలు 25 నుండి 40 శాతం పెంచేసుకున్నారు. ఒక సినిమా కోసం 20 నుండి 50 శాతం ప్రదర్శనలకు,  రెండు తెలుగు ప్రభుత్వాలు తమ శాయశక్తులా సహకరి స్తున్నాయి. అసలు ఒక్కో టిక్కెట్ రూ.2400/- వరకు అమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అసలు సినిమా టిక్కెట్స్ ఒక్కో వ్యక్తికి 2 నుంచి 4 కు మించి అమ్మరాదు. కార్పోరేట్ల పేర్లతో 300 నుండి 500 ఆపైన కూడా హోల్-సేల్ గా అమ్మెస్తున్నట్లు వార్తలు చదువుతున్నాం. ప్రకటించిన రేట్లకు మనకు టిక్కెట్స్ దొరికే అవకాశమే లేదు.


పెద్ద సినిమా అని 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తీసామని చెప్పుతూ అక్రమ అనారోగ్య పద్దతులకు ఈ సినిమా నిర్మాతలు తెరలేపారు. ప్రజల సంక్షేమం పరిరక్షించా ల్సిన ప్రభుత్వాలు నిర్మాతలు ప్రదర్శకులతో చేరి తానే తందానా అంటూ ప్రజా ప్రయోజనాలను మంటకలుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలకు నాయకులకు దగ్గర సంభందాలున్న ఈ నిర్మాతలు, నేపధ్యంలో ఉన్సి ఈ సినిమాలో అధికారిక అనధికారిక వాటాలున్న ఒక ప్రముఖ  స్టూడియో అధినేతల ప్రోద్భలం, అధికారు లు పోలీసుల సహకారంతో ఒక పదిరోజుల పాటు చట్టాన్ని తొక్కిపట్టి ప్రజలను నిట్టనిలువునా దోచుకోబోతుంది దర్శకదిగ్గజం రాజమౌళి గారి "బాహుబలి ది బిగినింగ్" ధారుణంగా ప్రజలను దోచుకుంది. ఆ అనుభవంతొ "బాహుబలి ది కంక్లూజన్" ద్వారా అద్భుత ప్రాణాళికలు సిద్ధంచేసిన బృహత్తర ప్రజా దోపిడీకి ప్రభుత్వాల సహాయంతో సిద్ధమౌతుంది. 




అంతెందుకు అమ్రపాలి అనే వరంగల్ జిల్లా కలక్టరే 300 టిక్కెట్స్ టొకున కొన్నట్లు వారతలు వస్తున్నాయి. ఇక ఎం.ఎల్.ఏ, ఎం.పి లు వ్యాపారవేత్తల ప్రతాపం చెప్పలేము. ఎంత బారీ దోపిడీకి సహకరిస్తున్న ప్రభుత్వాలను క్షమించనవసరం లేదు. సినిమా వ్యామోహం ఉన్న క్రింది మద్యతరగతి ప్రజల ఆర్ధిక పరిస్థితి కొంతకాలం కుప్పగూల వచ్చు. అందుకే ప్రజలు పైరసీ వైపు చూస్తారు. నేరం సమాజములో వృద్దిచెందటానికి కారణం ఈ వ్యాపారుల పెడదోరణులే కారణం. ఈ సినిమా దెబ్బకు చిన్న సినిమాలు సర్వనాశనమే. వాటితో సినీ రంగంలో నిరుద్యోగం ప్రబలటం చూస్తూనే ఉన్నాం. అప్పుడు వాళ్ళు నేరాలవైపుకు ఆకర్షించటం సహజం.




ఇక పైరసీ ని గురించి ఈ దర్శకధిగ్గజం మాట్లాడే అర్హత కోల్పోయారు.       

“బాహుబలి" సినిమా టికెట్‌ రేట్ల పెంపునకు హైకోర్టు అనుమతి లభించింది. భారీ బడ్జెట్‌ తో తెర కెక్కించిన ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ ధరల పెంపునకు అనుమతివ్వాలని నిర్మాతలు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. సమాధానం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయిం చారు. కొంతమేరకు ధర పెంచు కోవచ్చని కోర్టు ఆదేశాలివ్వడంతో థియేటర్లలో రూ.60 వరకూ పెంచారు.





ఈమేరకు, మల్టీప్లెక్స్‌ల్లో:

రూ.150 టికెట్‌ రూ.200కు,

రూ.200 టికెట్‌ రూ.250కు పెంచి విక్రయిస్తారు.


మామూలు థియేటర్లలో:

రూ.70 టికెట్‌ రూ.100కు,

రూ.90 టికెట్‌ రూ.150కి పెరిగాయి. పెంచిన ధరలు మొదటి వారం రోజులకు మాత్రమే వర్తిస్తాయి.





కాగా, బాహుబలి విడుదల సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాల్లో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేస్తు న్నారు. భీమవరంలో గతంలో పవన్‌కళ్యాణ్‌, ప్రభాస్‌ అభిమానుల మధ్య తలెత్తి న వివాదాల నేపథ్యంలో, వారితో ముందు జాగ్రత్త చర్యగా మాట్లాడారు. 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 అమలు చేస్తున్నారు. సినిమా విడుదల రెండురోజుల ముందు నుంచే పట్టణంలో గస్తీ ఏర్పాటు చేశారు. రాత్రిపూట పెట్రోలింగ్‌ నిర్వహిస్తు న్నారు. సినిమా విడుదల సందర్భంగా ర్యాలీలను నిషే ధించారు.


మరోవైపు బాహుబలి సినిమాలో ప్రధాన తారాగణం, దర్శకబృందం పశ్చిమ గోదావరి జిల్లాతో ఏదో రూపంతో ముడిపడి ఉన్నవారే. హీరో ప్రభాస్‌ ఈ జిల్లాకు చెందినవారే!ప్రతి నాయకుడి పాత్ర పోషించిన రానా తణుకు ముళ్ళపూడి వారి మనవడు. ఇక దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి సొంతూరు కొవ్వూరు. గ్రాఫిక్స్‌లో ముఖ్య భూమిక పోషించిన నిపుణుల బృందంలో అరడజను మంది ఈ జిల్లాకు చెందినవారే. రెండో భాగంలో ఉన్న సుబ్బరాజు, భీమవరానికి చెందినవారు.




సినిమా విడుదల సందర్భంగా కడప జిల్లా రైల్వే కోడూరులో గురువారం 10వేల మందితో భారీ ర్యాలీ జరగ నుంది. ఈ ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా ముంబై నుంచి 10 తెల్ల గుర్రాలను కూడా తెప్పించారు. అలాగే, 5వేల మందికి అన్నదానం చేయనున్నట్టు అభిమానులు తెలిపారు. భారీఎత్తున బాణసంచా కాలుస్తామని, ర్యాలీకి అనుమతి తీసుకున్నామని చెప్పారు. కాగా, ఈ సినిమా టికెట్ల కోసం భారీ ఎత్తు న పైరవీలు జరుగు తున్నాయి. ఒక ఎమ్మెల్యే తన అనుచరుల కోసం 300 టికెట్లు కొనుగోలు చేసినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: