షారుఖ్ ఖాన్ కి సౌత్ డైరెక్టర్స్ వార్నింగ్!?

E. Rama Krishna
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి గౌరవం పెరుగుతుంది. అయితే గత పది సంవత్సరాలు వెనక్కి వెళితే…సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చిన్నచూపు. సౌత్ మేకర్స్ కి సినిమాలు తీయటం రాదు అనేది వారి వాదన. ఉన్న కొద్ది మంది డైరెక్టర్స్ సైతం ఎప్పుడో కానీ సక్సెస్ కొట్టరు? అనేది బాలీవుడ్ హీరోలకి ఎక్కువుగా ఉంటుంది.


ఇక రీజనల్ ఇండస్ట్రీలకి బాలీవుడ్ బిజినెస్ తో పోటీ పడే సీన్ ఎక్కడా లేదు. అందుకే ఇన్ని విషయాల్లో బాలీవుడ్ టాప్ కాబట్టి…సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై వారికి చిన్న చూపు. ఈ విధమైన ఫీలింగ్ ఉన్న సమయంలో డైరెక్టర్ శంకర్ ఓసారి షారుఖ్ ఖాన్ తో సినిమా చేసేందుకు ప్లాన్ చేశారు. సినిమా కథ మొత్తం విన్న తరువాత కథని పూర్తిగా మార్చి రాయమని చెప్పాడు. దీంతో శంకర్ కి ఒళ్ళు మండిపోయింది. ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమపైనా షారుఖ్ ఖాన్ కామెంట్స్ చేశారు.


కొద్ది సంవత్సరాల క్రితం వర్మ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ ఛేయాల్సి ఉండగా…తెలుగు డైరెక్టర్స్ కి బాలీవుడ్ ని డీల్ చేసే సీన్ లేదు అని కామెంట్ కూడ చేశారంట. అయితే ఈ మధ్య కాలంలో అనూహ్యంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ భారీ విజయాల్ని సాధిస్తుంది. బాలీవుడ్ కి సాధ్యం కానీ సినిమాలను తెరకెక్కిస్తుంది. దీంతో షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్స్ తో పనిచేయటానికి రెడీ అయ్యారు. అందులో శంకర్, రాజమౌళిలు ఉన్నారు. అయితే శంకర్ మాత్రం తనతో పనిచేసేది లేదని తేల్చిచెప్పాడంట.


మార్కెట్ లో షారుఖ్ ఖాన్ ఇమేజ్ డామేజ్ అయిందని శంకర్ కామెంట్ చేయటం జరిగింది. ఇక రాజమౌళి అయితే ఇప్పట్లో కుదరదు అని షారుఖ్ ఖాన్ ప్రపోజల్ ని పూర్తిగా పక్కన పెట్టాడని అంటున్నారు. మొత్తంగా షారుఖ్ ఖాన్ పై సౌత్ డైరెక్టర్స్ కొంత కోపంగానే ఉన్నారు. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అందరి హీరోల కంటే ఒక్క షారుఖ్ ఖాన్ కి మాత్రమే అత్యధికంగా సౌత్ మేకర్స్ చెప్పిన కథలను రిజెక్ట్ చేశాడని అంటారు. అలాగే సౌత్ స్టైల్ కథను సాంబార్ కథలుగా వర్ణించిన హీరో కూడ షారుఖ్ ఖాన్ అనేది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: