2014లో అఖిల్ సినిమా రావడం ఖాయమైంది. అడ్డా ఆడియో వేడుకలో నాగ్ ఉత్సాహంగా అఖిల్ సినిమా కబురు వినిపించాడు. ఫ్యాన్స్ కూడా సంతోషించారు. అయితే అఖిల్‌ని ఏ దర్శకుడి చేతిలో పెడతారు? అనేది మాత్రం ఇంకా తేల్లేదు. యేడాదిగా అఖిల్ సినిమా గురించి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు నాగ్. అయితే అవి ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి.
అఖిల్‌ని రాజమౌళి చేతిలో పెట్టాలని నాగ్ చాలా ట్రై చేశాడు. అయితే రాజమౌళి బాహుబలి ప్రాజెక్టులో ఊపిరి సలపనంత బిజీలో పడిపోయాడు. అందులోంచి బయటకు వచ్చి మళ్లీ సినిమా తీయాలంటే దాదాపు మూడేళ్లు పడుతుంది. అందుకే రాజమౌళిని మర్చిపోయాడు నాగ్. పూరి, వినాయక్‌లాంటి దర్శకులకు అఖిల్‌ని అప్పగించడం కంటే కొత్త దర్శకుడి చేతిలో పెడితేనే అంచనాలు తట్టుకొనే అవకాశం ఉంటుందని నాగ్ డిసైడ్ అయ్యాడట.
��
అయితే చైతన్య కెరీర్ కూడా ఇలాగే కొత్త దర్శకుడితో ఆరంభం అయ్యింది. జోష్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి చైతూకి చాలాకాలం పట్టింది. అదే సీన్ అఖిల్ విషయంలో రిపీట్ కాకూడదని.... నాగ్ ఫీలౌతున్నాడు. కొత్త దర్శకుడే అయినా, అఖిల్‌కి నప్పే కథ ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటున్నాడట. కథ, దర్శకుడు ఆల్రెడీ సెట్ అయిపోయింది గానీ - నాగ్ మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నాడట. మరి ఆ సంగతులు ఎప్పుడు బయటపెడతాడో?