వర్షం పడిందా.. పాకిస్థాన్ ఇంటికే?

praveen
టి20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఎప్పుడైనా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయడం చూస్తూ ఉంటాము. కానీ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ చూసుకుంటే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమ్స్ అన్ని కూడా చెత్త ప్రదర్శన చేస్తూ టోర్నీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్లో ఉంటే.. అటు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన చిన్న టీమ్స్ మాత్రం అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ అదరగొడుతున్నాయ్.

 అయితే ఇలా ఈ ఏడాది వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో అటు పాకిస్తాన్ కూడా ఒక టీం గా కొనసాగుతుంది. అయితే వెస్టిండీస్, యుఎస్ వేదిక జరుగుతున్న వరల్డ్ కప్ తో టోర్నీలో అద్భుతంగా రాణించి  టైటిల్ గెలుస్తుంది అనుకుంటే అటు పాకిస్తాన్ జట్టు మాత్రం కనీసం సూపర్ 8 కి అయినా అర్హత సాధిస్తుందా లేదా అనే విషయంపై అనుమానాలు నెలకొన్నాయ్ అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు ఇక ప్రస్తుతం సూపర్ 8 కి చేరే అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ప్రస్తుతం ఆ జయాపజయాలతో పాటు   ఇతర టీమ్స్ గెలుపు ఓటమిల పైన కూడా పాకిస్తాన్ భవితవ్యం ఆధారపడి ఉంది.

 పాకిస్తాన్ జట్టు మొత్తంలో కూడా సూపర్ 8 గుబులు నెలకొంది. అయితే ఆ జట్టు సూపర్ 8 అర్హత సాధించాలంటే ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో భారీ విజయాన్ని సాధించాలి. అలాగే ఐర్లాండ్తో జరగబోయే మ్యాచ్లో అమెరికా జట్టు ఓడిపోవాలి. ఇక ప్రస్తుతం ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో ఇలా జరిగే మ్యాచ్లో ఏ ఒక్కటి రద్దయినా కూడా పాకిస్తాన్ జట్టు చివరికి వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించి ఇంటి బాట పడుతుంది. ఇక అప్పుడు అమెరికా తుదిదశకు చేరుకుంటుంది అని చెప్పాలి. నేడు యుఎస్, ఐర్లాండ్ జట్లు తలపడుతూ ఉండగా జూన్ 16వ తేదీన ఐర్లాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: