కల్కి 2898 ఏడి: గుడ్ న్యూస్.. సాంగ్ వచ్చేస్తోంది?

Purushottham Vinay
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమా జూన్ 27 వ తేదీన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.600 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి మూవీని థియేటర్స్ లోకి తీసుకొని వస్తున్నారు. మార్వెల్ సిరీస్ తరహాలోనే కల్కి ఫ్రాంచైజ్ లో మొదటి సినిమాగా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో కల్కి సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉండబోతోందనే మాట సినీ విశ్లేషకుల నుంచి సమాచారం వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ ఓ కొత్త ప్రపంచాన్ని కల్కి 2898 ఏడీ కోసం క్రియేట్ చేసాడని ఈ ట్రైలర్ తో స్పష్టం అయ్యింది. ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీగా ఈ మూవీ ఉండబోతోందని చిత్ర యూనిట్ తెలిపింది.దీనికి కారణం ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి టాప్ స్టార్స్ నటించడమే. హాలీవుడ్ లో కూడా కల్కి మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం యాక్టివ్ గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ ఎనౌన్స్ పోస్టర్ లో రెండు హ్యాండ్స్ ని చూపించారు. దీనిని బట్టి ఇది సినిమా కంటెంట్ ని రిప్రజెంట్ చేసే సాంగ్ అవ్వొచ్చనే మాట వినిపిస్తోంది. ఈ పాట ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. పాటలు  క్లిక్ అయితే మూవీకి మరింత హైప్ రావడం గ్యారెంటీ అనే ప్రచారం నడుస్తోంది. త్వరలో ఈ మూవీకి సంబంధించి యాక్టర్స్ ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.టీజర్ ఇంకా ట్రైలర్ పై అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక పాటలు కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మూవీని వీలైనంత స్ట్రాంగ్ గా పబ్లిక్ లోకి తీసుకొని వెళ్ళడానికి చిత్ర యూనిట్ యాక్టివ్ గా ప్రమోషన్స్ చేస్తోంది. తెలుగు, హిందీ భాషలలో కల్కి 2898ఏడీ సినిమా పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతున్నాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: