ఠాగూర్ సీన్ రిపీట్.. చనిపోయిన శవానికి వైద్యం.. ఎంత వసూలు చేశారంటే?

praveen
సాధారణంగా సినిమాల్లో ఎంతోమందిని ఆశ్చర్యపరిచే కొన్ని కొన్ని సన్నివేశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సన్నివేశాలు కొన్నిసార్లు నవ్విస్తే.. ఇంకొన్నిసార్లు భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా సినిమాల్లో ఆయా సన్నివేశాలను చూసినప్పుడు రియల్ లైఫ్ లో మాత్రం ఇలాంటి సన్నివేశాలు అస్సలు జరగవు అని అనుకుంటారు  చాలామంది. కానీ సినిమాలను తలపించే ఘటనలు రియల్ లైఫ్ లో కూడా అప్పుడప్పుడు జరుగుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయ్.

 ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఏకంగా చనిపోయిన డెడ్ బాడీని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్తే ఏకంగా ఆ వ్యక్తి బతికున్నట్లుగానే డాక్టర్లు ప్రవర్తిస్తారు. ఎంతో హడావిడి చేసి లక్షలరూపాయలు వసూలు చేస్తారూ. దీంతో ఇదంతా చూసి చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతారు. అయితే ఇలాంటి ఘటనలు నిజజీవితంలో జరగవు అని అందరూ అనుకుంటారు.

 కానీ ఇటీవల హైదరాబాద్ నగరంలో ఇలాంటి తరహా ఘటన ఒకటి జరిగింది. కూకట్పల్లిలో యువతీ మృతి చెందింది. అయితే చనిపోయిన యువతికి చికిత్స చేస్తున్నామని చెప్పి కుటుంబ సభ్యుల దగ్గర లక్షల రూపాయల బిల్లులు బస్సులు చేశారు వైద్యులు. ప్రవళిక అనే 29 ఏళ్ళ యువతీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడింది. అయితే ఆమెను కూకట్పల్లి లోనే అమోర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆపరేషన్ చేయాలని అందుకు  3.5 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పారు. అంతేకాకుండా మెడికల్ బిల్లులు ఇతర పరీక్షల పేరిట 16 లక్షల వరకు వసూలు చేశారు. అర్థరాత్రి సమయంలో ప్రవళిక చనిపోయింది అంటూ చెప్పడంతో సదరు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. చనిపోయిన తర్వాత చికిత్స పేరుతో లక్షలు వసూలు చేశారంటూ ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: