న‌రేంద్ర‌మోడీ - అమిత్ షా వేసిన ఎవ్వ‌రికి తెలియ‌ని ప్లాన్‌-బీ ఇదే..!

RAMAKRISHNA S.S.
కేంద్రంలో కొలువు దీరిన ఎన్డీయే కూట‌మికి జ‌వ‌స‌త్వాలు అందించింది.. ఏపీలోని టీడీపీ ఎంపీలే. ఈ నేప‌థ్యంలోనే వారికి రెండు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. మొత్తం 272 మంది ఎంపీలు ఉంటే త‌ప్ప‌. కేం ద్రంలో అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి లేద‌ని త‌రుణంలో బీజేపీకి 240 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. మిగిలిన వాటిని అటు బిహార్ సీఎం నితీష్ కుమార్ 12, చంద్ర‌బాబు 16 సీట్లు ఇచ్చారు. దీంతో 293 స్థానాలతో మోడీ స‌ర్కారు ఏర్ప‌డింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. మేజిక్ ఫిగ‌ర్ కంటే కూడా.. ఇప్పుడు మోడీకి 21 స్థానాలు ఎక్కువ‌గానే ఉన్నాయి.

అయితే.. మోడీ స‌ర్కారు.. తాను పెట్టుకున్న ల‌క్ష్యాలు సాధించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. వీటిలో జ‌మిలి ఎన్నిక‌లతోపాటు.. వివాదాస్ప‌ద యూసీసీని దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌డం, రాజ్యాంగంలోని కొన్ని రిజ ర్వేష‌న్ ప‌ర‌మైన అంశాల‌ను కూడా తీసేయాల‌ని భావిస్తోంది. ఇవి.. ఒక‌ర‌కంగా.. ఏపీ వంటి కీల‌క రాష్ట్రాల కు మింగుడుప‌డ‌ని అంశాలు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మోడీ ముస్లింల‌కు తాము రిజ‌ర్వేష‌న్  ఎత్తేస్తామ‌ని చెప్పారు. ఇది మోడీ స‌ర్కారు ఖ‌చ్చితంగా చేసి చూపించే విష‌యం.

ఎందుకంటే.. వ‌చ్చే ఏడాది యూపీలో ఎన్నిక‌లు ఉన్నాయి. అక్క‌డ మెజారిటీ ఓటు బ్యాంకు హిందువులే ఉన్నారు. ఇక‌, జ‌మిలి ఎన్నిక‌ల‌కు మెజారిటీ రాష్ట్రాలు జై కొట్టినా.. యూసీసీకి మాత్రం ఒప్పుకొనే ప‌రిస్థితి లేదు. ప్ర‌స్తుతానికి దీనిని ఐచ్ఛిక జాబితాలోనే ఉంచినా.. రాబోయే రోజుల్లో దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పారు. సో.. ఇవ‌న్నీ.. ప్రాంతీయ పార్టీల‌కు ఇబ్బంది క‌లిగించే విష‌యాలు. ఈ ప‌రిణామాల‌తో ఎప్పుడు ఏ పార్టీ అయినా.. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

దీనిని ముందుగానే అంచ‌నా వేస్తున్న మోడీ-అమిత్ షాలు.. ప్లాన్ బీని రెడీ చేసుకుంటున్న‌ట్టు జాతీయ మీడియా చెబుతోంది. దీనిలో భాగంగా.. త‌మకు ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా అయినా.. అంశాల వారీగా అయినా.. మ‌ద్ద‌తిచ్చే పార్టీల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ క్ర‌మంలో వైసీపీ వైపు మోడీ చూస్తున్నార‌ని తెలుస్తోంది. ఒక్క ఏపీనే కాదు.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ స్వ‌ల్ప సంఖ్య‌లో సీట్లు తెచ్చుకుని ఎన్డీయేలో చేర‌ని పార్టీల విష‌యంలో మోడీ ద్వ‌యం సానుకూలంగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ ప్లాన్ బిని ఎప్పుడైనా అమ‌లు చేయొచ్చు. సో.. ఈ నేప‌థ్యంలో ఎన్డీయే కూట‌మి ప‌క్షాలు కూడా.. ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: