అమరావతి: జగన్‌ ఆపించిన యాత్ర.. బాబు రాగానే ప్రారంభం?

Chakravarthi Kalyan
విజయవాడ ఇంద్రకీలాద్రికి రాజధాని రైతుల పాదయాత్ర ఇవాళ ప్రారంభమైంది. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని 2020 జనవరిలో చేపట్టిన పాదయాత్రకు అప్పటి జగన్  ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. సీడ్ యాక్సిస్ రహదారిపై మహిళలను అడ్డుకుని పోలీసులు లాఠీఛార్జి చేశారు. అందువల్ల బెజవాడ దుర్గమ్మకు రాజధాని మహిళలు మొక్కు తీర్చుకోలేకపోయారు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. అమరావతి అనుకూల ప్రభుత్వం వచ్చేసింది. అందుకే ఇప్పుడు మొక్కు తీర్చుకునేందుకు అమరావతి రైతులు దుర్గమ్మ సన్నిధికి బయలుదేరారు. తుళ్లూరు నుంచి ఇంద్రకీలాద్రి వరకూ పాదయాత్ర ప్రారంభించారు. అప్పట్లో గత ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు పెద్ద పోరాటమే చేశారు. రాజధాని గ్రామాల్లో ఊరూరా శిబిరాలు ఏర్పాటు చేసుకుని సంవత్సరాల తరబడి దీక్షలు చేశారు. అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ రావడంతో అమరావతి రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: