ప్రభాస్‌ టీమ్‌కు బంపర్ ఆఫర్‌ ఇచ్చిన రేవంత్ రెడ్డి?

Chakravarthi Kalyan
ప్రభాస్‌ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్‌ ఇచ్చారు. ప్రభాస్ కల్కీ చిత్ర టికెట్ ధరల పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి అనుమతించారు. అలాగే అదనపు షోలకు కూడా రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఈ నెల 27 నుంచి జులై 4 వరకు 8 రోజులపాటు టికెట్ ధరల  పెంపునకు రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ ఇటీవల వైజయంతీ మూవీస్ దరఖాస్తు చేసుకుంది.
దీంతో కల్కీ చిత్ర టికెట్ పై గరిష్టంగా రూ.200 పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణ థియేటర్లలో రూ.70, మల్టీఫ్లెక్స్ ల్లో రూ.100 పెంపునకు రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 27న ఉదయం 5:30 షోకు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. వారం రోజులపాటు ఐదు షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: