"చరణ్"కు రెండోసారి ఎదురుల్లుతున్న అనిల్.. ఈసారి కూడా అదే రిజల్ట్ వచ్చేనా..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు సినిమా పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఎక్కువ శాతం స్టార్ హీరోలు నటించిన సినిమాలు సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ ఉంటాయి. దానితో ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తైన సంక్రాంతి పండక్కు సినిమాలను చూడడానికి ఇష్టపడుతుంటారు. ఇకపోతే 2019 వ సంవత్సరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన వినయ విధేయ రామ అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇదే సంవత్సరం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2 సినిమా కూడా విడుదల అయింది.

ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇక వినయ్ విధేయ రామ సినిమా మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. చరణ్ తో ఒకసారి పోటీ పడి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు.

ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా మరోసారి చరణ్ సినిమాతో అనిల్ రావిపూడి పోటీ పడబోతున్నాడు. మరి 2019 వ సంవత్సరంతో సంక్రాంతికి చరణ్ తో పోటీపడి అనిల్ విజయాన్ని అందుకున్నాడు. మరి ఈ సారి చరణ్ తో పోటీపడి అనిల్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: