పెళ్లయిన స్టార్ హీరోని ప్రేమించి .. జీవితం నాశనం చేసుకుని.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా రాణించడానికి ఎంతో మంది అమ్మాయిలు ఎన్నో విధాలగా ప్రయత్నిస్తూ ఉంటారు .. ఎలాంటి బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో ప్రయాణం మొదలుపెట్టి ఎన్నో సవాలు ఎదుర్కొన్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు .. అందం అభినయంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగి  తమకంటూ సపరేట్ అభిమానులను క్రియేట్ చేసుకుంటారు. కెరియర్ మొదటలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ ఆ తర్వాత హీరోయిన్ల గా మారుతారు. వీరితోపాటు ఇతర భాషల నుంచి తెలుగులో అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్స్ కూడా ఎక్కువే ఉన్నారు. కానీ ఒక్కసారి హీరోయిన్గా క్రేజ్‌ సొంతం చేసుకుంటే ఆ తర్వాత చేసే చిన్న పొరపాట్లతో కెరియర్ నాశనం చేసుకుంటారు. అందులో ఈ హీరోయిన్ కూడా ఒకరు .. వరుస సినిమాలతో కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే పెళ్లయిన హీరోని ప్రేమించింది .. ఆ హీరోతో సహజీవనం కూడా చేసింది .. ఈ విషయం ఆ హీరో భార్యకు తెలియడంతో ఆమెకు వార్నింగ్ ఇవ్వటం చివరకు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరగటంతో ఆమె కెరియర్ అక్కడితో క్లోజ్ అయింది ...

ఇంత‌కి ఆ హాట్ భామ ఎవరు అంటే .. ఆమె మరి ఎవరో కాదు నిఖిత .. ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది .. అప్పటిలో అందం అభినయంతో కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్గా మారింది. తెలుగు , తమిళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు ఈమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. అంతేకాదు ఆ సమయంలో కుర్రాళ్లకు కలల రాకుమారి కూడా ఈమె అని చెప్పాలి. 2002లో హాయ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తరవాత వేణు హీరోగా 2003లో వచ్చిన కళ్యాణ రాముడు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఇక దాంతో తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి. అలా టాలీవుడ్ లో సంబరం, ఖుషీ ఖుషీగా, ఏవండోయ్ శ్రీవారు, మహారాజశ్రీ  వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .

ఇక నాగార్జున అనుష్క జంట‌గా నటించిన డాన్ సినిమాలో విలన్ పాత్ర‌లో కూడా నటించింది .. అయితే అప్పట్లో ఈ భామ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నిఖిత.. కన్నడలో కూడా పలు సినిమాల్లో నటించింది.  అదే సమయంలో అక్కడి స్టార్ హీరో దర్శన్ తో ప్రేమలో పడింది. అప్పటికే దర్శనకు పెళ్లయింది.. అయినా కూడా ఇద్దరూ క్లోజ్ గా ఉంటూ చట్టపట్టలేసుకొని తిరిగారు .. ఇక వీరిద్దరి రిలేషన్షిప్ గురించి దర్శన్ భార్యకు తెలియడంతో ఆమె నిఖితకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా ఈ ఇద్దరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో చివరకు తన భర్త పై పోలీసు కంప్లీట్ కూడా ఇచ్చింది .. ఆ తర్వాత పోలీసులు దర్శన్‌ను అరెస్ట్ చేశారు .. ఈ వ్యవహారం ఇండస్ట్రీలో కూడా పెద్ద చర్చ కావడంతో నిఖితను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది .. దాదాపు మూడు సంవత్సరాల పాటు కన్నడలో నిఖితను బ్యాన్ చేశారు .. బ్యాన్ ఎత్తివేసిన తర్వాత కూడా నిఖితకు అంతగా అవకాశాలు రాలేదు .. అయితే 2017లో బిజినెస్ మాన్ గగన్‌దీప్ సింగ్ ను ఈమె పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ సినిమాలకు దూరంగా  ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: