ఎస్ జే సూర్య అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది ఖుషీ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో రూపొందించిన చిత్ర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతకుముందు మహేశ్‌బాబుతో నాని, ఆ తర్వాత పవన్ కల్యాణ్‌తో తీసిన కొమురం పులి చిత్రాలు నిరాశను మిగిల్చాయి. దాంతో కొంత కాలం తెలుగు సినిమాకు దూరమయ్యాడు.తాజాగా మళ్లీ ఇప్పుడు తెలుగు లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇదిలావుండగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్గా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో శనివారం రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేశ్ , ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరి , ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు , ఎమ్మెల్యే బత్తుల బలరాం, ఎమ్మెల్సీ హరి ప్రసాద్ , ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, చైర్మన్ తుమ్మల బాబు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ క్రమంలో ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘నా స్నేహితుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన్ను ఇలా చూడటంతో నాకు మాటలు రావడం లేదు. ఆయన్ను ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉంది. ఈ ఈవెంట్ చరిత్రలో నిలవబోతోంది. ఆయన రావడమే ఈ ఈవెంట్‌కు ప్రత్యేకత. నా జీవితంలో ఏ ఆర్ రెహమాన్, పవన్ కళ్యాణ్ గారు నా ఆలోచనా ధోరణిని మార్చేశారు. ఖుషి కథ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మార్పులు చెప్పారు. ఓ పాటను, మూడు ఫైట్లను యాడ్ చేశారు. మాట ఇస్తే నిలబడాలి అని పవన్ కళ్యాణ్ గారు నాకు నేర్పారు. గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ గారు రెండు పాత్రల్లో అదరగొట్టేశారు. శంకర్ గారు విజన్, తమన్ గారి మ్యూజిక్ అదిరిపోయింది. రామ్ చరణ్‌తో నాకు ఉండే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ పర్ఫామెన్స్‌కు అవార్డు వస్తుందని సుకుమార్ గారు చెప్పారు. అప్పన్న పాత్రలో రామ్ చరణ్ ఇరగ్గొట్టేశారు. సంక్రాంతికి రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.