హైదరాబాద్‌ మాదాపూర్‌లో భారీగా దొరికిన డ్రగ్స్?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ పోలీసులు మరో భారీ డ్రగ్స్ ముఠాను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకొస్తున్న సాయి చరణ్ ని టీజీ న్యాబ్‌ మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ ని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి ట్రావెల్స్ డ్రైవర్స్ ఇస్తున్న సాయి చరణ్.. తద్వారా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్స్  డ్రైవర్ ద్వారా డ్రగ్స్ రవాణా చేయిస్తున్నాడు. నలుగురు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న వ్యాపారవేత్తలతో పాటు సాయిచరణ్ ను  పోలీసులు అరెస్ట్ చేశారు.

సాయిచరణ్ నుంచి పెద్ద మొత్తంలో ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యంను నార్కోటిక్ బ్యూరో అరెస్ట్ చేసింది. గతంలోనూ సాయిచరణ్ ను పోలీసులు పట్టుకున్నారు. విడుదలైన తర్వాత కూడా అతడు అదే పని చేస్తున్నాడు. 50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సర్పంచి చేస్తున్న సాయి చరణ్.. హైదరాబాద్ నెల్లూరు విజయవాడ రాజమండ్రి వైజాగ్ లో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నాడు. పలు ట్రావెల్స్ ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: