తండ్రి పై సంచలన వ్యాఖ్యలు చేసిన వనిత విజయ్ కుమార్..!

murali krishna
వనిత విజయ్ కుమార్ తెలుగులో దేవి చిత్రంలో కీలక పాత్రలో నటించింది. భానుచందర్ కి ఆమె భార్యగా నటించింది. ఆ విధంగా వనిత తెలుగువారికి పరిచయం. రీసెంట్ గా నరేష్ మళ్ళీ పెళ్లి చిత్రంలో నటించింది.తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయం. స్నేహం కోసం, సాంబ, ప్రతిరోజు పండగే, సరైనోడు, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ పాత్రలకు ఆయన చక్కగా సరిపోతారు. ఆయన రెండవ భార్య మంజుల కూడా నటిగా రాణించారు.విజయ్ కుమార్ మొదటి భార్యకు తమిళ హీరో అరుణ్ విజయ్ సంతానం. రెండవ భార్య మంజులకి వనిత విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్, ప్రీతా విజయ్ కుమార్ ముగ్గురు సంతానం. ఈ ముగ్గురు హీరోయిన్లుగా రాణించిన వారే. వనిత విజయ్ కుమార్ తెలుగులో దేవి చిత్రంలో కీలక పాత్రలో నటించింది. భానుచందర్ కి ఆమె భార్యగా నటించింది. ఆ విధంగా వనిత తెలుగువారికి పరిచయం.రీసెంట్ గా నరేష్ మళ్ళీ పెళ్లి చిత్రంలో నటించింది. అయితే వనిత విజయ్ కుమార్ తరచుగా వివాదాల్లో ఉంటుంది. ఆమె పెళ్లిళ్ల వ్యవహారం.. కుటుంబ గొడవలు, ఆస్తి వ్యవహారాలు నిత్యం మీడియాలో వైరల్ అవుతుంటాయి.
 తన తండ్రి తనకి రావలసి ఆస్తి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వనిత పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన తల్లి మంజుల మరణించే సమయంలో జరిగిన పరిస్థితులని వివరించింది. నిజంగా ఆమె చెప్పిన విషయం వింటే దారుణం అనిపిస్తుంది. రెండవ భార్యగా తన తల్లికి తండ్రి ప్రాధాన్యత ఇవ్వడనే విషయాన్ని వనిత పేర్కొంది.

 వనిత మాట్లాడుతూ.. మా అమ్మ మంజులకి మద్యం సేవించే అలవాటు ఉంది. దీనితో పలు సందర్భాల్లో ఆమెకి కామెర్లు వచ్చాయి.ఎంత హెచ్చరించినా వినలేదు. కానీ ఒకసారి మద్యం సేవించడం వల్ల కామెర్లు బాగా ఎక్కువయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళితే వైద్యులు 72 గంటల్లో చనిపోతారని తెలిపారు. ఆ సమయంలో కూడా అమ్మ మా గురించే ఆలోచించింది. తాను లేకపోతే మీకు దక్కాల్సిన ఆస్తి దక్కదు అని చెప్పింది.ఆసుపత్రి బెడ్ పై ఉంటూనే ఢిల్లీలోని ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానీకి ఫోన్ చేసింది. తన పిల్లలకి రావాల్సిన ఆస్తిని వారి పేరుపై మార్చాలి. డాక్యుమెంట్స్ సిద్ధం చేయాలి అని కోరింది. అలాగే వాంగ్మూలంగా వీడియో కూడా తీయాలి అని చెప్పింది. కానీ ఈ సమయంలో కరెక్ట్ కాదు అని వద్దని చెప్పా. అప్పుడు నాన్న వనిత బాగోగులు నేను చూసుకుంటాను. ఆమెకి అన్యాయం జరగనివ్వను అని చేయి పట్టుకుని చెప్పాడు.అప్పుడు అమ్మ నమ్మింది. నేను కూడా నమ్మాను. అమ్మ మరణించిన తర్వాత అంతా తలక్రిందులుగా మారిపోయింది. అంత్యక్రియలకు కూడా నాన్న మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. అప్పుడు శరత్ కుమార్, రాధా రవి గారు మమ్మల్ని పిలిచి అంత్యక్రియలు చేయించారు. అమ్మ చనిపోయిన తర్వాత ఆస్తిలో నాకు హక్కు లేదని అంటున్నారు. ఆస్తి పంచితే అది నాకు కూడా చెందుతుంది అని వనిత వాదిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: