తెలుగు అమ్మాయే అయినా.. సరైన అవకాశాలు రాక దిగాలు పడిపోయింది బిందుమాధవి కెరీర్. పద్ధతిగా కనిపిస్తే ఇంతేనేమో అనుకొని - కొన్ని సినిమాల్లో హాట్ బాటకూడా పట్టింది. అయినా ఆమెను ఎవరూ కనికరించలేదు. ఇప్పుడు.. ఆ డోసు పెంచింది. ప్రస్తుతం తమిళ చిత్రం దేశింగు రాజా లో నటిస్తోంది. ఇందులో తన అందాలతో ప్రేక్షకులను కనువిందు చేయాలని డిసైడ్ అయ్యిందట.
తెలుగులో అవకాశాలు రాక.. తమిళ రంగంపైనే దృష్టి పెట్టింది... బిందుమాధవి. అక్కడ హాట్ భామ అవతారం ఎత్తడంతో కొద్దో గొప్పో ఛాన్సులు అందుతున్నాయి. ఇక ఈ బాటే బెటర్ అనుకొంటోంది. ''కథానాయిక అన్నాక అందంగా కనిపించాలి. నేనూ అదే చేస్తున్నా. ముఖ్యంగా నా చూపులు అందరికీ నచ్చుతాయట. మీవి సిల్క్‌స్మిత చూపులండీ..'' అని చాలామంది మెచ్చుకొంటారు. అదో పెద్ద కాంప్లిమెంట్‌గా స్వీకరిస్తా..`` అని చెబుతోంది.
��
తమిళంలో ఎన్ని అవకాశాలు వస్తున్నా తెలుగులో మాత్రం తనను ఎవరూ గుర్తించడం లేదని తెగ ఫీలైపోతోంది. ''ఆవకాయ్ బిర్యానీ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. కానీ సరిగా ఆడలేదు. బంపర్ ఆఫర్ ఆడినా ఆ క్రెడిట్ నాకు దక్కలేదు..'' అని వాపోతోంది.