ప్రముఖ సినిమిటోగ్రాఫర్ శ్రీనివాసరెడ్డి కన్నుమూత

Edari Rama Krishna
సీనియర్ కెమెరామెన్, దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఉయ్యూరు మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు.  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీనియర్‌ దర్శకులు సాగర్‌కి ఈయన తమ్ముడు. ఛాయాగ్రాహకుడిగా పలు చిత్రాలకు పనిచేసిన ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి గతంలో మౌళి, సుధాకర్‌బాబు, సాగర్‌లతో కలసి మౌళి క్రియేషన్స్‌ పతాకంపై సూపర్‌స్టార్‌ కృష్ణ హీరోగా ‘జగదేకవీరుడు’, ‘అమ్మదొంగా’ చిత్రాలు నిర్మించారు.

సొంతంగా బాచి, మొండోడు చిత్రాల్ని నిర్మించారు.   నిర్మాత చంటి అడ్డాలతో కలిసి పవిత్రప్రేమ, ఆరోప్రాణం, బాచి తదితర చిత్రాలను నిర్మించారు. ఆరో ప్రాణం, మొండోడు వంటి చిత్రాలు కూడా శ్రీనివాసరెడ్డి నిర్మాణంలో తెరకెక్కినవే. ఇక ఇటీవల రష్మి గౌతమ్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చారుశీల సినిమాకు దర్శకత్వం వహించారు శ్రీనివాసరెడ్డి.

తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సేవలందించిన శ్రీనివాసరెడ్డి అకాల మరణం ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ రోజు మహాప్రస్థానంలో శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: