శ్రుతిహాసన్ ఆఫర్స్ ని లాక్కున్న సమంత
వీరిద్దరి మధ్య గత రెండు సంవత్సరాల నుండి భారీ పోటీ జరుగుతుంది. టాప్ హీరోలు అంతా సమంతని హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయితే, ఈ విషంయం తెలుసుకున్న శ్రుతిహాసన్…సమంత ఆఫర్స్ ని ఏ విధంగా చేజిక్కించుకోవాలి అన్న విధంగా మంతనాలు జరిపేది. సమంత సైతం శ్రుతిహాసన్ విషయంలో ఈ విధంగానే ట్రిక్స్ ని ప్లే చేసేదని అంటున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా శ్రుతిహాసన్ కి సంబంధించిన 3 క్రేజీ ఆఫర్స్ ని సమంత చేజిక్కించుకుందని అంటున్నారు.
సూర్య, విజయ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోల సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా ప్యూచర్ ప్రాజెక్ట్స్ లో కమిట్మెంట్స్ పూర్తయ్యాయి. అయితే చివరి నిముషంలో ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ డైరెక్టర్స్ శ్రుతిహాసన్ ని రీప్లేస్ చేసి…సమంతని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇది సమంత చేసిన గ్రౌండ్ వర్క్ అని శ్రుతిహాసన్ ని బాగా తెలుసంట.
అందుకే శ్రుతిహాసన్ ప్రస్తుతం సమంత కి దక్కుతున్న ఆఫర్స్ వివరాలను తెలుసుకునే ప్రయత్నాలను చేస్తుంది. సమంత చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ ని ఎలాగైనా తాను దక్కించుకునేలా ప్రయత్నాలను చేస్తుంది. దీన్ని బట్టి చూస్తుంటే…ఈ ఇద్దరి హీరోయిన్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారిందని అంటున్నారు.