పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అక్కినేని యంగ్ హీరో అఖిల్ దృష్టి పడింది. చాలామంది యంగ్ హీరోలు పవన్ నామస్మరణ తమ సినిమాలలో చేస్తూ ఉంటే అఖిల్ మాత్రం మరో అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆ శక్తికరమైన ఈ విషయం వివరాలోకి వెళితే అఖిల్ ఈమధ్య ఒక ఛానల్ కు ఇచ్చిన కు ఇంటర్వ్యూ లో పవన్ పై ఆ శక్తికర వ్యాక్యాలు చేసాడు. పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో చాలా సింపుల్‌గా కామ్‌గా కనిపిస్తాడు.
పొడిపొడిగా మాట్లాడుతూ రిజర్వ్డ్గా ఉంటాడు అయితే వెండితెర పై పవన్ పాత్రలు మాత్రం చాలా ఉత్సాహంగా జోష్ తో ఉంటాయి అని కామెంట్ చేస్తూ కెమెరా ముందుకు రాగానే పవన్ కు అంత పవర్ ఎలా వచ్చేస్తుoదో తనకు అర్ధం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు అఖిల్. అంతేకాదు సినిమాలలో కనిపించే పవన్ కళ్యాణ్ కు నిజ జీవితంలో కనిపించే పవన్ కు చాల తేడా ఉంటుంది అని కామెంట్ చేస్తూ పవన్ షూటింగ్ కు వెళ్లేముందు ఏమైనా ఒక మెడిసిన్ తీసుకుంటాడేమో అన్న అనుమానం తనకు ఉంది అని కామెంట్ చేస్తూ ఆ మెడిసెన్ సీక్రెట్ తెలుసుకోవాలని ఉంది అని అంటూ ఏకంగా పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేసాడు అఖిల్.
ఇదే సందర్భంలో ఆ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్న యాంకర్ ఐదేళ్ల తర్వాత మల్టీస్టారర్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడిగిన ప్రశ్నకు సందహానం ఇస్తూ మరో ఆలోచన లేకుండా మహేష్ బాబుతో అని సమాధానం ఇచ్చాడు అఖిల్. ఇదే ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ జూనియర్ అంటే అభిమానమని మహేష్ అంటే గౌరవం అంటూ చాల తెలివిగా సమాధానం ఇచ్చాడు ఈ అక్కినేని యంగ్ హీరో.
అంతేకాదు అనుష్క గార్జియస్ అని శ్రియకు మంచి డ్రెస్సింగ్ సెన్స్ ఉందని తన తండ్రి నాగార్జున హీరోయిన్స్ పై కామెంట్స్ చేసాడు. అయితే తన తొలి సినిమా హీరోయిన్ సాయేషా సైగల్ చాలా క్యూట్ అని చెపుతున్న అఖిల్ అల్లు వారి కాంపౌండ్ ఆధ్వర్యంలో నిర్మించే సినిమాలో నటించాలని ఉంది అని అంటూ మరో షాకింగ్ కోరిక బయట పెట్టాడు. ఏమైనా అఖిల్ ప్లాన్స్ వింటూ ఉంటే మటుకు భారీ ఆలోచనలతో చాల పెద్ద ఎత్తుగడలతోనే ఉన్నట్లు కనిపిస్తోంది..