మలుపులతో మెప్పించే... తెప్పసముద్రం

Chakravarthi Kalyan
‘బిగ్ బాస్’ ఫేం అర్జున్ అంబటి, కిశోరి దాత్రక్ జంటగా నటించిన చిత్రం ‘తెప్పసముద్రం’. ఇందులో వరుసగా సినిమాలు చేస్తున్న యువ హీరో చైతన్యరావుది ఇందులో కీలకమైన పాత్ర. ఈ చిత్రానికి సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్  నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్ సంగీతం అందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ: తెలంగాణాలోని తెప్పసముద్రం అనే ఊళ్లో చిన్న పిల్లలు మాయం అవుతూ ఉంటారు. వారి ఆచూకీ కోసం తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. వారితోపాటు ఎస్.ఐ.గణేష్ (చైతన్యరావు) కూడా వారి ఆచూకీ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. నేత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఇందు (కిశోరి ధాత్రిక్) కూడా తన ఫౌండేషన్ లో తప్పి పోయిన పిల్లల కోసం వెదకుతుంటుంది. అలాగే ఇందును ప్రాణంగా ప్రేమించే విజయ్(అర్జున్ అంబటి) కూడా తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఎస్.ఐ.గణేష్ తండ్రి లాయర్ విశ్వనాథ్ ( సాయికుమార్ సోదరుడు రవిశంకర్) కూడా తన వద్దకు వచ్చే ట్యూషన్ పిల్లలు తప్పి పోవడంతో వారి కోసం వెదుకుతుంటారు. ఎవరికి వారు తప్పిపోయిన చిన్నారులకోసం తమ వంతు ప్రయత్నాలు చేసే క్రమంలో అందరూ విస్తుపోయే నిజం ఒకటి బయటకు వస్తుంది. అది ఏమిటి? తప్పి పోయిన చిన్నారులు ఏమయ్యారు? తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే... ఈ సినిమాని చూడాల్సిందే.

స్టోరీ... స్క్రీన్ ప్లే విశ్లేషణ: వరుస హత్యలు... చిన్నారుల మీద అఘాయిత్యాలు లాంటి ప్లాట్ ఉన్న సినిమాలకు కొన్ని ఆసక్తికరమైన మలుపులతో స్క్రీన్ ప్లేను నడిపితే... ఆడియన్స్ ను బాగా ఎంగేజ్ చేయొచ్చు. ఇలాంటి కథను అనేక ట్విస్టులతో ఆసక్తికరంగా నడిపించారు దర్శకుడు. చివరి వరకు అసలు హంతకుడు ఎవరనేది ప్రేక్షకులు ఓ పట్టాన కన్ ఫర్మేషన్ కు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమాని ఆసక్తికరంగా ఆవిష్కరించారు. దాంతో ఆడియన్ ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసి... ద్వితీయార్థం అంతా ట్విస్టులతో సినిమాని భలే ఎంగేజ్ చేశారు దర్శకుడు సతీష్.హాజీపూర్ సంఘటనలాంటి వాస్తవ సంఘటను కొంత బేస్... చేసుకున్నా... అందులో వచ్చే మలుపులు ఆడియన్స్ ను బాగా థ్రిల్లింగ్ కు గురిచేస్తాయి. ఇందులోనే ఓ సోషియల్ మెసేజ్ కూడా ఇచ్చారు దర్శకుడు. మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది.

ఇందులో ఆటోడ్రైవర్ గా, హీరోయిన్ అవర్ గా విజయ్ పాత్రలో నటించిన అర్జున్ అంబటి తన నటనతో ఆకట్టుకున్నారు. డ్యాన్సులు కూడా బాగానే చేశారు. అతనికి జోడీగా నటించిన కిశోరి దాత్రిక్ కూడా తన పరిధిమేరకు నటించి మెప్పించింది. విలన్ పాత్రలో గజాగా నటించిన చైతన్య దాత్రిక్ కూతురే ఈ అమ్మాయి.తండ్రీకూతుళ్లు ఇందులో నటించారు. ఇక చైతన్య రావు   కీలకమైన పాత్రలో మెప్పించారు. ఇతని కేరీర్ లో ఇలాంటి పాత్రను పోషించలేదు. లాయర్ విశ్వనాథ్ గా చాలా బరువైన పాత్రను పోషించారు. ఆయనకు భార్యగా నటించిన నటి కూడా బాగానే నటించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.

వాస్తవ సంఘటనను బేస్ చేసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథనం ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఆద్యంతం మలుపులతో ఆడియన్స్ ను థ్రిల్ గురిచేశారు. సినిమాటోగ్రీఫి పర్వాలేదు. ద్వితీయార్థంలో విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. సంగీతం బాగుంది. పాటలు మాస్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ వీకెండ్ లో మంచి సోషల్ మెసేజ్ తో కూడిన్ థ్రిల్లర్ ‘తెప్పసముద్రం’. సరదాగా చూసేయొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: