శివమ్ : రివ్యూ
ఓపెన్ చేస్తే మన హీరో పేరు శివ(రామ్).. మనవాడికి నచ్చినట్లు ఉంటూ, నచ్చింది చేస్తూ, ఫ్రెండ్స్ కి చుక్కలు చూపిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేసే మెంటాలింటీ ఉన్న యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడు. కానీ వీడికి ఉన్న మెయిన్ క్వాలిటీ ప్రేమికుల కోసం ఎంత రిస్క్ అన్నా చేసి వారి పెళ్లి చేస్తాడు. అలాగే ప్రేమ విషయంలో మనోడికి ఉన్న ఒకే ఒక్క క్లారిటీ.. 'మనకు నచ్చిన అమ్మాయి దొరికేంత వరకూ వెయిట్ చెయ్యాలి. దొరికాక ఆ అమ్మాయి కోసం ఫైట్ చెయ్యాలి'. అలా అనుకునే మనోడికి నచ్చిన అమ్మాయి దొరుకుతుంది. తన పేరే తను(రాశీ ఖన్నా). ఇక తన వెంట పడుతూ ఉన్న టైంలో జడ్చర్ల ఏరియాలో బాగా బలం ఉండి రౌడీయిజం చేసే బోజి రెడ్డి(వినీత్ కుమార్) మనుషులు శివాని చంపాలని వెతుకుతూ ఉంటారు. అదే టైంలో హైదరాబాద్ లో దందాలు చేసే అభి(అభిమన్యు సింగ్) కూడా శివ కోసం వెతుకుతూ ఉంటాడు. శివ ప్రేమని తను ఓకే చేసే టైంకి శివాని బోజి రెడ్డి మనుషులు, తనుని అభి మనుషులు తీసుకెళ్లిపోతారు. కట్ చేస్తే శివ కోసం వచ్చిన అభి మనుషులు తనుని ఎందుకు తీసుకెళ్ళారు.? బోజి రెడ్డి మనుషుల నుంచి శివ ఎలా తప్పించుకుకొని తన ప్రేమను, తనుని కాపాడుకున్నాడు అన్నదే మీరు చూసి తెలుసుకోవాల్సిన పరం రొటీన్ కథ..
మన హీరో రామ్ కి ఉన్న పేరు ఎనర్జిటిక్ స్టార్. అక్కడక్కడా పలువురు స్టార్స్ ని ఇమిటేట్ చేసినట్టు కనిపించినా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పటి వరకూ తన సినిమాల్లో చేసిన తరహాలో ఉండే పాత్రనే మరోసారి ఇందులో చేసాడు. ఈ పాత్రలో కొత్తదనం అంటూ ఏమీ లేదు. సో ఎలాగూ ఇన్ని రోజులు ఇదే తరహా పాత్రలు చేసిన రామ్ కి ఈ పాత్ర చేయడం పెద్ద కష్టమేమీ కాదు. అదే ఎక్స్ ప్రెషన్స్, అదే ఫైట్స్, అదే డాన్సులు.. సో అన్నీ యాజిటీజ్ గా చేసేసాడు. కానీ చాలా చోట్ల అవసరం లేకపోయినా ఓవర్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చేసాడు, వాటిని డైరెక్టర్ కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. శివ పాత్రలో రామ్ ఓ చేసేసింది అనడానికి ఏమీ లేదు. ఇక హీరోయిన్ రాశి ఖన్నా మాత్రం ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే మొదటి రెండు సినిమాల కంటే మించి ఈ సినిమాలో స్కిన్ షో చేసింది. కానీ పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం రెండు సినిమాల కంటే బాగా తక్కువ. ఇక్కడ సమస్య కూడా దర్శకుడే, తనకు కావాల్సింది నటీనటుల నుంచి సరిగా రాబట్టుకోలేదు. విలన్ గా చేసిన అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ లను సినిమాకి విలన్స్ అనడం కంటే జోకర్స్ అనడం బెటర్. వారికి ఒక పాత్ర లేదు, పాడు లేదు. దాంతో సినిమాలో విలనిజం జీరో, వాళ్ళని జోకర్ గా చేసి చూపడం వలన మనకు ఇర్రిటేషణ్ ఒకేసారి వస్తాయి. ఇక ఎప్పటిలానే మన తెలుగు హిట్ ఫార్ములా అయిన కామెడీ గ్యాంగ్ ని పెట్టి నవ్వించడం లో కూసింత ట్రై చేసిన డైరెక్టర్ బ్రహ్మానందం, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సప్తగిరి, పోసాని కృష్ణమురళి, జయప్రకాశ్ రెడ్డి, కృష్ణభగవాన్, చంటి, శకలక శంకర్, తాగోబోతు రమేష్ ఇలా ఎవ్వరూ ఆడియన్స్ ని పెద్దగా నవ్వించలేకపోయారు. వీరికంటే కాస్త బెటర్ గా ఫిష్ వెంకట్ నవ్వించాడు. ఇక సినిమాలో చెప్పుకోదగిన పాత్రలు చేసిన వారు లేరు, వారి గురించి చెప్పడానికి ఏమీ లేదు.
దాదాపు 9 ఏళ్ళుగా టాలీవుడ్ లో బాగా హిట్ ఫార్ములాగా పేరు తెచ్చుకున్న రొటీన్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫార్ములాని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే 'శివమ్'. మొదటి నుంచి చివరి దాకా అదే పాత కొట్టుడు ఎలా అంటే - హీరో పెద్ద తోపుగాడు, హీరోయిన్ తో లవ్వయ్యిద్ది, కట్ చేస్తే విలన్ ఎంట్రీ, వాడి దగ్గరికే వెళ్లి వాన్నే బకారానికి చేసి హీరోయిన్ ని తెచ్చుకోవడం. ఇంతోటికి కథకేనా అంత బిల్డప్ అనుకోకండి.. ఎందుకంటే దీనికన్నా మించి తీయాలని మనోళ్ళు అస్సల ట్రై చేయడం లేదు. శివమ్ సినిమా ద్వారా పరమ రొటీన్ ఆడియన్స్ కోరుకునే 4 యాక్షన్ ఎపిసోడ్స్, 5 పాటలు, 6 కామెడీ బిట్స్ ని కూడా అందించలేకపోయారు. ఇప్పుడిప్పుడే వస్తున్న యంగ్ దర్శకులు కూడా ఇదే పాత చింతకాయ పచ్చడి కథలని పట్టుకోవడం, వాటితోనే సినిమాలు చేయడం టాలీవుడ్ స్థాయిని మరింత దిగజార్చేలా ఉంది. ఓవరాల్ గా శివమ్ లో మీకు కిక్ ఇచ్చే పాయింట్ లేదా సీన్స్ ఏమీ ఉండవు. సింపుల్ గా శివమ్ అనే సినిమాని మీరు స్కిప్ చేస్తేనే మీకు మీ ఆరోగ్యానికి, మీ టైంకి చాలా చాలా మంచిది. టాలీవుడ్ లో వచ్చిన మరో ది వరస్ట్ డిజాస్టర్ మూవీ 'శివమ్'.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Shivam
-
Hero
-
Cinema
-
marriage
-
Girl
-
Rajasekhar Sivani
-
Hyderabad
-
Shiva
-
lord siva
-
Reddy
-
ram pothineni
-
Director
-
Heroine
-
Abhimanyu Mithun
-
vineet kumar
-
Joker
-
Telugu
-
Comedy
-
srinivas
-
Kavuru Srinivas
-
sathyam
-
Audience
-
fish venkat
-
Episode
-
Kathanam
-
Kick
-
cinema theater
-
Success
-
Venkatesh
-
Love
-
idiot
-
Kandireega
-
posani krishna murali
-
Europe countries
-
prasad
-
Music
-
Kishore Tirumala
-
Peter Hein
-
Tollywood