"సలార్ 2" షూటింగ్ స్టార్ట్ పై క్రేజీ అప్డేట్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరుగా సలార్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి , బాబి సింహా ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... రవి బుశ్రుర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. మొత్తం గా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మొదటి భాగం పోయిన సంవత్సరం డిసెంబర్ నెల 22 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది.

ఈ సినిమా యొక్క రెండవ భాగం షూటింగ్ స్టార్ట్ కి సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. సలార్ పార్ట్ 2 మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల చివరి వారం నుండి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ తొలి షెడ్యూల్ లో భాగంగా 10 రోజుల పాటు ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దాని కోసం ఇప్పటికే హైదరాబాదు లో ఒక ప్రత్యేక సెట్ ను కూడా వేసినట్లు సమాచారం.

మొదట ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలను పూర్తి చేసి వచ్చే సంవత్సరం ప్రారంభం లో మిగతా షూటింగ్ ను పూర్తి చేయాలి అని ప్రశాంత్ నిల్ భావిస్తున్నారట. వచ్చే సంవత్సరం చివరిలో ఈ మూవీ ని విడుదల చేయడానికి ఈ మూవీ బృందం ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే సలార్ మొదటి భాగం అద్భుతమైన విజయం అందుకోవడంతో రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ మూవీ ని రూపొందించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: