లై : రివ్యూ

kumar siva
స్టార్ కాస్ట్ , సినిమాటోగ్రఫీ , యాక్షన్ సీన్స్స్టార్ కాస్ట్ , సినిమాటోగ్రఫీ , యాక్షన్ సీన్స్ఎడిటింగ్ , స్క్రీన్ ప్లే
ఏ. సత్యం ఎలాంటి భాధ్యతలు లేని కుర్రాడు. పెద్దింటి అమ్మాయిని పెళ్లాడాలనే ఆలోచనతో ఉన్న సత్యానికి చైత్ర (మేఘా ఆకాష్) పరిచయం అవుతుంది. యూఎస్ టూర్ ఉండటం వల్ల పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న చైత్ర సత్యంతో కలిసి యూఎస్ ట్రిప్ వేస్తుంది. ఇద్దరు ఒకరికి ఒకరు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రేమలో పడతారు. ఇక వీరిమధ్యన విలన్ ఏ.సత్యం (అర్జున్) ఎలా వచ్చాడు. ఇంతలోనే స్టోరీలో ఊహించని ట్విస్ట్..? అసలు ఈ విలన్ ఎవరు..? వీరి మధ్య ఏం జరిగింది అన్నది అసలు కథ. 

సత్యం గా నితిన్ నటన అదుర్స్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్ లో నితిన్ బాగా ఆకట్టుకున్నాడు. అఆ తర్వాత నితిన్ ఈ సినిమాతో రావడం అతని కెరియర్ కు మంచి హెల్ప్ అవుతుంది. ఇక చైత్రగా మేఘా ఆకాష్ మంచి నటన కనబరిచింది. మొదటి సినిమానే అయినా ఆమె మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. విలన్ గా అర్జున్ అదరగొట్టాడు. స్టైలిష్ విలన్ గా అర్జున్ కు మంచి పేరొస్తుంది. శ్రీరాం, అజయ్, నాజర్, రవి కిషన్, బ్రహ్మాజి, పృధ్విరాజ్, బ్రహ్మానందం అంతా మంచి నటన కనబరిచారు. 

సినిమా దర్శకుడు హను మంచి థ్రిల్లర్ తో లై తీశాడు. యాక్షన్ సీన్స్ లో హైలెట్ గా వచ్చిందని చెప్పొచ్చు. మణిశర్మ మ్యూజిక్ అయితే పీక్స్. కెమెరామెన్ కూడా బాగా వర్క్ అవుట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడ రాజి పడలేదు. సినిమాను ఎంత రిచ్ గా తీశారో సినిమా తెర మీద చూస్తేనే అర్ధమవుతుంది. 

సినిమా టైటిల్ ప్రకారంగానే లవ్, ఇంటెలిజెన్స్, ఎన్మిటీ ఈ మూడు అంశాలు సినిమాలో ఉన్నాయి. హను రాసుకున్న కథ కథనాలు మేజర్ ప్లస్ పాయింట్స్.. కచ్చితంగా తెలుగు ఆడియెన్స్ కు నచ్చే సినిమా అవుతుంది. కథ కథనాల్లో దర్శకుడు ప్రతిభ మెచ్చుకోదగినది. చాలా నీట్ గా ప్రతి విషయాన్ని డీటేల్డ్ గా వివరించాడు.

అబద్ధం చుట్టూ తిరిగే కథగా లై కొత్త అప్పీల్ ను చూపిస్తుంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ తర్వాత నితిన్ తో హను చేసిన ఈ ప్రయత్నం ఇంప్రెసివ్ గా ఉంది. అయితే కథ కథనాల్లో కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా ఎంత స్టైలిష్ గా అనిపించినా కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు చెప్పొచ్చు.

అర్జున్ విలనిజం బాగుంది. తను రాసుకున్న కథకు పర్ఫెక్ట్ యాక్టర్స్ ను ఎంపిక చేసుకున్నాడు హను. స్టైలిష్ మూవీగా నితిన్ లై ఆడియెన్స్ మెప్పుపొందే అవకాశం ఉంది.
Nithiin,Megha Akash,Arjun Sarja,Hanu Raghavapudi,Ram Achanta,Gopichand Achanta,Anil Sunkara,Mani Sharmaనితిన్ 'లై' స్టైలిష్ ఎంటర్టైనర్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: