యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ సాహో. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. జాతీయ స్థాయిలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న ఈ సినిమా టజీర్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే కట్ చేశారు. ప్రభాస్ స్టైలీష్ లుక్‌తో పాటు కళ్లు చెదిరి, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ విన్యాసాలతో టీజర్ ఫ్రేములు ఉండేలా దర్శకుడు సుజీత్ ప్లాన్ చేశారు.
ఇప్పటికే మేకింగ్ వీడియోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ఏకంగా టీజర్ తో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేశారు. సినిమాలో ప్రభాస్ - శ్రద్ధాకపూర్ రొమాన్స్ బాగానే వర్కవుట్ అయ్యింది. కేవలం యాక్షన్ కోసమే కోట్లు కుమ్మరించకుండా రొమాన్స విజువల్స్ కూడా గ్రాండ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు.
బాహుబలి సీరిస్ సినిమాలతో ప్రభాస్ నేషనల్ హీరోగా ఎదిగిపోవడంతో పాటు ఇంటర్నేషనల్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రభాస్‌కు ఏకంగా అంతర్జాతీయంగా కూడా అభిమానులు ఉన్నారు. సాహో సినిమాతో ప్రభాస్ నేషనల్ లెవల్లో మరో మెట్టు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. టీజర్లో ప్రభాస్‌ను హాలీవుడ్ హీరో స్థాయిలో స్టైలిష్ లుక్‌లో ప్రజెంట్ చేశారు.
టీజర్‌కు ఏ మాత్రం వంక పెట్టడానికి వీలు లేకపోయినా చిన్న చిన్న లోపాలు మాత్రం ఉన్నాయి. కథేంటి అన్నది పూర్తిగా రివీల్ చేయలేదు. ఇక టీజర్ అంతా ఎక్కువగా యాక్షన్ షాట్సే ఉండటంతో కాస్త గజిబిజీగా అనిపిస్తుంది. సినిమా కూడా ఇదే తరహాలో యాక్షన్‌తోనే ఉంటే యాక్షన్ ప్రియులకు ఓకే. మిగిలిన వర్గాల వారు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారా ? అన్న చిన్న డౌట్ కూడా ఉంది. ఇది మినహా మిగిలింది అంతా ఓకే.