అదేంటీ వరుణ్ బీచ్ లో పెళ్లి చేసుకోవడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారు..వరుణ్ అంటే మెగా ప్రిన్స్ వరుణ్ కాదండోయ్..బాలీవుడ్ హీరో వరుణ్ దావణ్. యంగ్ డైనమిక్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తన ప్రియురాలు నటాశా దలాల్‌ను ఈ యేడాది చివరల్లో పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక బాలీవుడ్లో ఇటీవల రణ్వీర్ సింగ్, దీపికా, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ వంటి వారు ప్రేమించి పెళ్లిచేసుకొని ఒకింటి వారైన విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో వరుణ్ దావణ్ కూడా జాయన్ అయ్యాడు. ఈ యేడాది చివరల్లో పెళ్లిచేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా గోవా బీచ్ దగ్గర వెడ్డింగ్ చేసుకోబోతున్నట్టు సమాచారం.
కొంత కాలంగా నటాషాతో వరుణ్ బహిరంగానే తిరుగుతున్నాడు. అంతేకాదు వాళ్ల రిలేషన్ షిప్‌పై కాఫీ విత్ కరణ్ షోలో వరుణ్ .. తమ మధ్యగల బంధాన్ని వివరించాడు. అంతే కాదు నటాషాతో డేటింగ్లో వున్న.. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం..అని వరుణ్ ఆ షోలో ప్రకటించాడు. ప్రస్తుతం వరుణ్ ధావన్..కూలీ నెం.1 రీమేక్‌తో పాటు త్రీడీ డాన్స్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు.